ఆ యాత్రతోనే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం : కిషన్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ అధ్వానంగా ఉందన్నారు. దళారీలు, అధికారులు, ప్రభుత్వం మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ చేపట్టిన బస్సు (Bus) యాత్రతోనే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. కేంద్రం ధాన్యం తీసుకోవట్లేదని ముఖ్యమంత్రి (Chief Minister,), మంత్రులు చెబుతున్నారు. ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వం పని అని స్పష్టం చేశారు. ఖరీఫ్ లో 58.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని కేంద్రం, రాష్ట్రం మధ్య ఒప్పందం కుదిరిందని వివరించారు. కమీషన్లు, రియల్ ఎస్టేట్ (Real Estate) పైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని విమర్శించారు.ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని ఎద్దేవా చేశారు.







