జూన్ 6కి వాయిదా పడిన టీటీఎస్ మెన్స్ పికిల్‌బాల్ టోర్నమెంట్
TTS: టెన్నెస్సీ తెలుగు సమితి (TTS) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మెన్స్ పికిల్‌బాల్ టోర్నమెంట్ – స్ప్రింగ్ 2026’ (Men’s Pickleball Tournament – Spring 2026) తేదీలలో మార్పు జరిగింది. ఈ టోర్నమెంట్ గతంలో నిర్ణయించిన మే 30, 2026 తేదీ నుండి జూన్ 6, 2026 (06-Jun-2026) కి వాయిదా పడింది.
ఈ తేదీ మార్పు కారణంగా టోర్నమెంట్లో పాల్గొనేందుకు మరికొన్ని కొత్త స్థానాలు (Spots) అందుబాటులోకి వచ్చాయి. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
టోర్నమెంట్ వివరాలు..
తేదీ: జూన్ 6, 2026 (శనివారం)
సమయం: ఉదయం 8 గంటల నుండి (From 8am)
వేదిక: విలియమ్సన్ కౌంటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 920 హెరిటేజ్ వే, బ్రెంట్వుడ్, TN 37027 (Williamson County Indoor Sports Complex, 920 Heritage Way, Brentwood, TN 37027)
ఎంట్రీ ఫీజు: ఒక టీమ్‌కు $40 డాలర్లు ($40/Team)
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు అధికారిక లింక్ https://tinyurl.com/TTSMPBS2026 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టెన్నెస్సీ తెలుగు సమితి నిర్వాహకులు తెలిపారు.







