రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Y.S. Sharmila) భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (K.C. Venugopal) పాల్గొన్నారు. షర్మిల కర్ణాటక (Karnataka) నుంచి రాజ్యసభ (Rajya Sabha) సీటు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో అక్కడ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె రాహుల్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంతో పాటు వివిధ అంశాలపై రాహుల్‌గాంధీ పలు సూచనలు చేసినట్లు షర్మిల తెలిపారు.







