పార్లమెంటులో ఆమోదం పొందినా, లేకున్నా.. రాష్ట్రంలో : మంత్రి అనిత
మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill) పార్లమెంటులో ఆమోదం పొందినా లేకున్నా, రాష్ట్రం లోని మహిళలకు చట్టసభలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ (TDP) నిర్ణయించడం పట్ల మంత్రి వంగలపూడి అనిత (Anita Vangalapudi) హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహానాడు (Mahanadu) వేదికగా సీఎం చంద్రబాబు ఈ నిర్ణయాన్ని ప్రకటించడం చరిత్రాత్మకమని అన్నారు. ఇదొక సామాజిక విప్లవంగా అభివర్ణించారు. 33 శాతం టికెట్లు మహిళలకు ఇస్తామని ధైర్యంగా ప్రకటించిన ఏకైక పార్టీ టీడీపీ. దేశంలో అన్ని పార్టీలు ఇదే విధానం పాటిస్తే మహిళా బిల్లు వచ్చి తీరుతుంది. దానికి తొలి అడుగు టీడీపీ వేసింది. సీఎం చంద్రబాబు, టీడీపీ కూటమి మహిళా పక్షపాతి. ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎసఎంఈ పార్కులు కేటాయించారు అన్నారు.







