కర్ణాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల ?
కర్ణాటకు (Karnataka) నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావహులంతా అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్కు 136 సభ్యుల బలం ఉండటంతో ఆ పార్టీ కనీసం ముగ్గురని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Y.S. Sharmila) పేరు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. ఇటీవల ఆమె పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో సమావేశమై ఇదే విషయమై చర్చించినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ సభ్యత్వం ముగియనుండటంతో ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వటం దాదాపు ఖరారైంది.








