‘దీదీ’’ టార్గెట్ కాకుండా… అభిషేక్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు?
బెంగాల్ లో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ, సామాజిక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి అటు రాజకీయంగా, ఇటు పరిపాలనా పరంగా వేగంగా పట్టు సాధిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ ని చెడుగుడు ఆడుకుంటున్నారు. దీదీ మమత బెనర్జీ హయాంలో తీసుకున్న చాలా నిర్ణయాలను రద్దు చేసేశారు. వాటి స్థానంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న జాతీయవాద దృక్పథంతో వుండే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇది ఇలా వుండగా… ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ చాలా సంవత్సరాలు బెంగాల్ ను పరిపాలించారు. బీజేపీ కార్యకర్తలే టార్గెట్ గా రాజకీయాలు చేస్తూ వచ్చారు. కానీ.. ఇప్పుడు బెంగాల్ లో మమతా బెనర్జీ అధికారంలో లేరు. సహజంగానే ఇప్పటి బీజేపీ ప్రభుత్వానికి మమతా బెనర్జీయే టార్గెట్ కావాలి. కానీ.. అలా కావడం లేదు. మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ లో నెంబర్ 2 స్థానంలో వున్న అభిషేక్ బెనర్జీ టార్గెట్ అవుతున్నారు.
ఏకంగా అభిషేక్ బెనర్జీపై దాడే జరిగింది. బీజేపీ నేతలందరకీ అభిషేక్ టార్గెట్ అయ్యారు.గత 15 ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన TMC, 294 మంది సభ్యులు కలిగిన శాసనసభలో కేవలం 80 స్థానాలకు పరిమితమైపోగా, BJP ఏకంగా 208 స్థానాలను గెలుచుకుని భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. ఈ ఘోర పరాజయం తరువాత, TMC తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. పార్టీ శ్రేణులు చెల్లాచెదురవుతున్నాయి, నాయకులు పార్టీకి రాజీనామాలు కూడా చేస్తున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ దుస్థితికి ఏ రాజకీయ నాయకుడూ గానీ, ప్రజలు గానీ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని నిందించడం లేదు; దానికి బదులుగా, ఆ ఆగ్రహమంతా ఆమె మేనల్లుడు, వారసుడైన అభిషేక్ బెనర్జీ వైపే మళ్లుతోంది. కోల్‌కతా ప్రజలలో అభిషేక్ బెనర్జీ పట్ల ఉన్న ఆగ్రహం ఏ ఒక్కసారిగానో ప్రజ్వరిల్లలేదు.
ఇవి కూడా చదవండి
అయితే.. దీని వెనుక ఓ కారణం వున్నట్లు అభిప్రాయాలున్నాయి. కాళీఘాట్‌లో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం అత్యంత నిరాడంబరమైందింగా వుండేది. అదే అభిషేక్ బెనర్జీ నివాసమైన ‘‘శాంతి నికేతన్’’ నిత్యం వైభవం, ఆడంబరాలకు ప్రతీకగా వుండేది.బారికేడ్లతో ఆ ప్రాంతాన్ని మూసేసేవారు. దీంతో ప్రజలకు కూడా తీవ్ర అసౌకర్యం కలిగేది. అంతేకాకుండా అభిషేక్ కాన్వాయ్ వెళ్లిన ప్రతీ సందర్భంలోనూ రోడ్లను చాలా సేపు మూసేసేవారు. దీంతో ప్రజలకు అభిషేక్ అంటే విరక్తి పుట్టింది. అభిషేక్ అంటేనే ఆడంబరాలు, అధికార దర్పం అని తేలిపోయింది.
తాజాగా టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి అభిషేక్ బెనర్జీ సోనార్పూర్ వెళ్లారు. ఆ సమయంలో ఓ గుంపు ఆయన్ను చుట్టుముట్టింది. దొంగ దొంగ అంటూ నినాదాలు కూడా ఇచ్చారు.గుడ్లు, రాళ్లతో కూడా దాడికి దిగారు. అయితే.. దీనికి బీజేపీయే కారణమని టీఎంసీ చెబుతుంటే.. ఏళ్ల తరబడి సాగిన దుష్పరిపాలనపై ఆగ్రహంగానే స్థానికులే దాడికి దిగారని స్థానిక ప్రజలే పేర్కొంటున్నారు.
అభిషేక్ పై సీనియర్ల గుర్రు…
పార్టీలో అభిషేక్ అంచెలంచెలుగా ఎదగలేదు. క్షేత్ర స్థాయి నుంచి రాజకీయంలోకి రాలేదు. అమాంతంగా పార్టీలో ఎదిగిపోయారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేకుండా వచ్చేసి, పార్టీలోని సీనియర్లకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో సీనియర్లలో అసంతృప్తి రేగింది. 011 తర్వాత అభిషేక్ ప్రాముఖ్యత పెరగడం వల్లే—చివరికి 2017లో పార్టీని వీడిన—ముకుల్ రాయ్ వంటి సమర్థుడైన వ్యూహకర్త సైడ్ అయిపోయారు. అప్పటి టీఎంసీ నేత, ఇప్పటి ముఖ్యమంత్రి సువేందు విషయంలోనూ ఇదే జరిగింది.
ఇక.. మరో అంశంలోనూ పార్టీలో, ప్రజల్లో, కేడర్ లో ఆగ్రహం వుంది. ఐ ప్యాక్ అనే సంస్థను తీసుకొచ్చింది అభిషేకే అని అంటారు. దీంతో కేడర్ చుట్టూ కాకుండా, దాని చుట్టూ రాజకీయాలు తిరిగాయి. క్షేత్రస్థాయి నాయకులను పక్కన పెట్టి, పార్టీ మొత్తాన్ని ఒక “కార్పొరేట్ తరహాలో హైజాక్” చేశారని ఆగ్రహం కూడా వుంది.
అంతేకాకుండా తృణమూల్ అధికారంలో వున్న సమయంలో విపరీతమైన అవినీతి జరిగింది.వీటన్నింటిలోనూ అభిషేక్ కీలక పాత్ర అని స్వయంగా పార్టీ నేతలే పేర్కొంటున్నారు. పాఠశాల నియామకాల కుంభకోణం (WBSSC) — ‘Leaps and Bounds Private Limited’ సంస్థతో ఆయనకు ఉన్న సంబంధాల కారణంగా, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన్ని పలుమార్లు ప్రశ్నించాయి. CBI 2025లో దాఖలు చేసిన అభియోగపత్రంలో, అక్రమ నియామకాలకు ప్రతిఫలంగా ₹15 కోట్లు డిమాండ్ చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో అభిషేక్ టార్గెట్ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి








