మహారాష్ట్ర సీఎంతో మంత్రి నారా లోకేశ్ భేటీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis)తో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ముంబయిలో భేటీ అయ్యారు. సీఎంను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించి, శ్రీవారి ప్రతిమను లోకేశ్ అందజేశారు. గణేశ్ ప్రతిమను లోకేశ్‌కు సీఎం దేవేంద్ర బహుకరించారు. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Speed of Doing Business) గురించి దేవేంద్ర ఫడణవీస్‌కు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా శాఖ (Department of Education)లో తీసుకువచ్చిన సంస్కరణలు, స్కిల్ డెవలప్మెంట్ విధానాలు తెలియజేశారు. మహారాష్ట్ర ఐటీ, విద్యా శాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలు సీఎంను అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి








