జనం ఛీకొట్టినా… డ్రామాలు మానరా? : లోకేశ్
నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం (YSR Statue) ధ్వంసమైన ఘటనపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. నంద్యాల (Nandyal)లో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేసిన జమ్ములయ్య (Jammulayya) వైసీపీ నేతల అనుచరుడేనని పోలీసులు తేల్చినట్లు చెప్పారు. బాబాయి గుండెపోటు, కోడి కత్తి, గులకాయి నాటకాల రాయుడైన జగన్ (Jagan) మరో కొత్త డ్రామా సృష్టించాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను సైకో జగన్ రంగంలోకి దింపారని మండిపడ్డారు. జగన్నాటకాలు చూసి జనం ఛీకొట్టినా, డ్రామాలు మానట్లేదని అన్నారు. ఎన్ని సార్లు దొరికిపోయినా కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా? అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి







