జూన్ 21న క్వీన్స్‌లాండ్‌లో ఏఏక్యూ ఉచిత యోగా సెషన్
AAQ: ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్లాండ్ (AAQ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day 2026) పురస్కరించుకుని ఒక ప్రత్యేక ఉచిత యోగా సెషన్‌ను నిర్వహించనున్నారు. సమాజంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత , సమతుల్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
వేదిక , సమయం..
ఈ ఉచిత యోగా ఈవెంట్ 2026, జూన్ 21వ తేదీ ఆదివారం ఉదయం 8:45 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం 52 మర్ఫీ రోడ్, జిల్మేర్ (52 Murphy Road, Zillmere Qld 4034) లో జరగనుంది.
యోగా ఇన్స్ట్రక్టర్ వివరాలు..
‘యోగా ఫర్ బ్లిస్’ (Yoga for Bliss) వ్యవస్థాపకురాలు, సర్టిఫైడ్ యోగా టీచర్ కీర్తన సోమంచి ఈ శిక్షణను అందించనున్నారు. ఆమె మెంటల్ హెల్త్ ఫస్ట్ ఐడర్ , రెసిలియన్స్ అడ్వకేట్‌గా సేవలందిస్తున్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది మైండ్‌ఫుల్ మూవ్మెంట్, శ్వాసక్రియ (బ్రీత్వర్క్), ధ్యానం , యోగా ఫిలాసఫీ ద్వారా మానసిక సమతుల్యతను, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే జీవన విధానమని ఆమె పేర్కొన్నారు.
సూచనలు..
- ఈ సెషన్ పూర్తిగా ఉచితం , ప్రారంభకులకు సైతం సులభంగా ఉండేలా (Beginner-Friendly) రూపకల్పన చేశారు.
- పాల్గొనే వారు తమ స్వంత యోగా మ్యాట్ (Yoga mat) , కుషన్ తీసుకొని రావలెను.
- సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి.
- కార్యక్రమానికి హాజరయ్యే ముందు కనీసం 2 గంటల వ్యవధిలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ ఉచిత సెషన్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ (RSVP) తప్పనిసరి. ఆసక్తి గలవారు ఆన్లైన్ ఫామ్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఏఏక్యూ (Team AAQ) ప్రతినిధులు జానకిరామ్ (0414214441), సునీత జక్కంపూడి (0481 834 943), రామ్ జున్నూరి (0406660906), , విద్యా మల్లెల (0488 054 335) లను సంప్రదించవచ్చని నిర్వాహక బృందం తెలిపింది.
ఇవి కూడా చదవండి








