మంచు కొండల్లో లీలమ్మ అందాలు
టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీగా శ్రీలీల(Sree Leela) అందరికీ సుపరిచితురాలే. పలు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల, రీసెంట్ గా ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ గా ప్రాక్టీస్ ను కూడా మొదలుపెట్టింది. ఓ వైపు నటిగా, మరోవైపు డాక్టర్ గా ఉంటూనే ఇంకోవైపు పర్సనల్ లైఫ్ నూ ఎంజాయ్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తుంది. అందులో భాగంగానే అమ్మడు తాజాగా హిమాలయాల టూర్ కు వెళ్లి అక్కడి నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రీలీల మంచును ఎంజాయ్ చేస్తూ చాలా అందంగా కనిపించగా, ఆ ఫోటోలకు నెటిజన్లు లీలమ్మ సూపర్బ్ అంటూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.







