బాలయ్య సినిమా నుంచి ఓ సీక్వెన్స్ లీక్
నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri balakrishna) హీరోగా తెరకెక్కుతున్న 111(NBK111)వ సినిమా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichan malineni)తో వీరసింహా రెడ్డి(Veera simharddy) తర్వాత మరోసారి చేతులు కలిపిన బాలయ్య, ఈసారి పూర్తి భిన్నమైన స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దేశభక్తి అంశాలను కూడా కథలో మిళితం చేస్తూ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో వేగంగా కొనసాగుతోంది. భారీ నిర్మాణ విలువలు, యాక్షన్ ఎపిసోడ్లు, బాలయ్య కొత్త లుక్ కారణంగా సినిమా ప్రారంభం నుంచే చర్చనీయాంశంగా మారింది.
ఇలాంటి సమయంలో సినిమా నుంచి ఊహించని విధంగా ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఆన్లైన్లో లీక్ కావడం ఆసక్తిని మరింత పెంచింది. కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఆ విజువల్స్‌లో బాలకృష్ణ పాల్గొన్న హై- ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ కనిపించడంతో అభిమానులు వాటిని విపరీతంగా షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సన్నివేశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, సినిమాలోని యాక్షన్ డిజైన్, విజువల్ ట్రీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా గోపీచంద్ మలినేని ఈసారి బాలయ్యను మరింత స్టైలిష్‌గా ప్రెజెంట్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే లీకైన వీడియోలు మరింతగా వ్యాప్తి చెందకుండా మేకర్స్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల నుంచి ఆ క్లిప్‌లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని టాక్ వినిపిస్తోంది. లీక్ అయిన ఫుటేజ్‌తో సినిమాపై ఆసక్తి పెరిగినప్పటికీ, అసలు థియేట్రికల్ అనుభూతిని కాపాడేందుకు మేకర్స్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రాన్ని వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas) నిర్మిస్తుండగా, బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.







