కుండీల్లోని మొక్కలకు తెల్లనల్లి, పేనుబంక పట్టి పాడుచేస్తున్నాయా? ఈ సహజ చిట్కాలతో వాటిని సులభంగా తరిమికొట్టండి.
ఒక లీటరు నీటిలో చెంచా వేపనూనె, కొద్దిగా లిక్విడ్ సోప్ కలిపి మొక్కలపై స్ప్రే చేయండి. నల్లి పురుగులు వెంటనే నశిస్తాయి.
వేపనూనె స్ప్రే
వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ను నీటిలో మరిగించి, వడకట్టి మొక్కలపై చల్లండి. దీని ఘాటుకు పురుగులు పారిపోతాయి.
వెల్లుల్లి, పచ్చిమిర్చి ద్రావణం
కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్‌ను నీటిలో కలిపి పురుగులు ఉన్నచోట స్ప్రే చేయాలి. ఇది నల్లి పురుగుల పొరను దెబ్బతీస్తుంది.
డిష్ వాష్ లిక్విడ్
దూదిని రబ్బింగ్ ఆల్కహాల్లో ముంచి, నల్లి పురుగులు ఉన్న ఆకులపై తుడవండి. తక్కువ పురుగులు ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది.
ఆల్కహాల్ పద్ధతి
బియ్యం కడిగిన నీటిని రెండు రోజులు పులియబెట్టి, ఆ నీటిని మొక్కలపై చల్లితే చీడపీడలు చేరకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి.
బియ్యం కడిగిన నీరు
నల్లి పురుగు పట్టిన కుండీని మిగతా మొక్కల నుండి దూరంగా ఉంచండి. లేదంటే ఈ పురుగులు పక్కనే ఉన్న ఇతర మొక్కలకూ పాకుతాయి.
మొక్కల ఐసోలేషన్