జూన్ 6న జార్జియాలో వైభవంగా జీటీఏ ఇంటర్నేషనల్ ఫెస్ట్
GTA: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో “జీటీఏ ఇంటర్నేషనల్ ఫెస్ట్” (GTA International Fest) నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ‘చిన్న వ్యాపారాల సాధికారత’ (Empowering Small Businesses) అనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
వేదిక , సమయం..
ఈ అంతర్జాతీయ పండుగ 2026, జూన్ 6వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అమెరికాలోని జార్జియాలో గల ఫౌలర్ పార్క్ (Fowler Park, 4110 Carolene Way, Cumming GA, USA, 30040) లో జరగనుంది. ఈ ఈవెంట్కు వచ్చే సందర్శకులకు ప్రవేశం (Free Entry) , పార్కింగ్ పూర్తిగా ఉచితం.
ప్రధాన ఆకర్షణలు..
హెల్త్ ఫెయిర్ (Health Fair)..
గాపి (GAPI – Georgia Association of Physicians of Indian Heritage) వైద్యుల ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉచిత హెల్త్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఇందులో లైసెన్స్ వైద్యులచే ఉచిత ఆరోగ్య సలహాలు, బీపీ , వైటల్స్ పరీక్షలు చేయనున్నారు.
ఫ్లాష్ మాబ్ (Flash Mob)..
రొమ్ము క్యాన్సర్ అవగాహన (Breast Cancer Awareness) కు మద్దతుగా 200 మందికి పైగా మహిళలతో ప్రత్యేక ఫ్లాష్ మాబ్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో జరుగుతోంది.
ఇతర వినోదాలు..
గ్లోబల్ వంటకాలు (Global Cuisine), కిడ్స్ జోన్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ , సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
వ్యాపార స్టాళ్లు (Vendor Stalls), స్పాన్సర్షిప్స్ , సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలనుకునే వారు పోస్టర్లో ఇచ్చిన క్యూఆర్ కోడ్లు (QR Codes) లేదా వెబ్సైట్ (www.gtaatlanta.org) ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.







