త్వరలో విశాఖకు బుల్లెట్ రైలు : మాధవ్
దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపట్నుంచి ప్రారంభం కానుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే జోన్ (Railway Zone)కోసం 30 ఏళ్లుగా బీజేపీ పోరాడిందన్నారు. విభజన చట్టంలో రైల్వేజోన్ చేర్చడంలో ఆ పార్టీ కృషి అనిర్వచనీయమన్నారు. విశాఖ (Visakha) కేంద్రంగా బుల్లెట్ రైలు (Bullet Train) త్వరలో వస్తుందని రైల్వే మంత్రి చెప్పారని మాధవ్ వివరించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి







