ట్రెండీ అవుట్‌ఫిట్ లో మెరిసిపోతున్న కియారా
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) గురించి, ఆమె గ్లామర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఉండే కియారా తాజాగా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతున్నాయి. ఈ ఫోటోల్లో కియారా ఐవరీ కోఆర్డ్ ఎన్సెంబుల్ డ్రెస్ ధరించి నడుము భాగంలో పెప్లమ్ ప్రిల్స్ ఉండి, భుజాల నుంచి కార్సెట్ జారుతున్నట్టు డిజైన్ చేసిన డ్రెస్ ధరించింది. ఈ అవుట్‌ఫిట్ చాలా మోడ్రన్ గా ఎట్రాక్టివ్ గా ఉండగా, ఈ డ్రెస్ లో అమ్మడి అందం మరింత ఎలివేట్ అవుతుందని నెటిజన్లు ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.








