దశాబ్దాల కల నెరవేరుతోంది : సీఎం చంద్రబాబు
విశాఖపట్నం కేంద్రంగా జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ (Railway Zone) అధికారికంగా ప్రారంభం కావడం చరిత్రాత్మక మైలురాయి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందించారు. దశాబ్దాల కల నెరవేరుతోందని, నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమÖలంగా మారుస్తుందని అభిప్రాయపడ్డారు. కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామికవృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ఇదొక కీలక మైలురాయి కానుందన్నారు. తమ చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw)లకు రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.







