వెంకీ, శివ, గీతు… పైచేయి ఎవరిది?
టాలీవుడ్, పాన్ ఇండియా బాక్సాఫీస్ రేసులో ప్రస్తుతం మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చర్చనీయాంశంగా మారాయి. సూర్య(suriya) నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath & Sons), రవితేజ(Raviteja) ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఇరుముడి(Irumudi), యష్(Yash) నటిస్తున్న టాక్సిక్(Toxic).. ఈ మూడు సినిమాలు మూడు భిన్నమైన కమర్షియల్ ఈక్వేషన్స్ తో ముందుకు వస్తున్నాయి. డైరెక్టర్ల ట్రాక్ రికార్డ్, కథల ఎంపిక, మార్కెట్ అంచనాలు, పెట్టుబడి స్థాయి వంటి అంశాలను పరిశీలిస్తే, ఈ మూడు సినిమాల బాక్సాఫీస్ అవకాశాలు ఒకే స్థాయిలో లేవని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ల బలాలు ఈ ప్రాజెక్టుల ఫ్యూచర్‌ను డిసైడ్ చేసే కీలక అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఈ ముగ్గురిలో వెంకీ అట్లూరి(Venky atluri) ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం కొంత స్పష్టమైన అడ్వాంటేజ్ కనిపిస్తోంది. సార్(Sir), లక్కీ భాస్కర్(Lucky Baskhar) సక్సెస్‌ల తర్వాత ఆయనపై ప్రేక్షకుల్లో ఏర్పడిన నమ్మకం, ఫ్యామిలీ ఎమోషన్స్ ను బలమైన రచనతో మిళితం చేసే శైలి, విస్తృత ప్రేక్షక వర్గాన్ని ఆకట్టుకునే సామర్థ్యం ఈ సినిమాకు అనుకూలంగా మారవచ్చు. మరోవైపు శివ నిర్వాణ(Shiva nirvana) తెరకెక్కిస్తున్న ఇరుముడి ఎమోషనల్ స్క్రీన్‌ప్లేపై ఎక్కువగా ఆధారపడుతోంది. రవితేజకు ఇది రొటీన్ మాస్ ఫార్మాట్‌కు భిన్నమైన ప్రయత్నంగా కనిపిస్తోంది. పైగా లాభాల భాగస్వామ్య మోడల్ కారణంగా ఆర్థిక రిస్క్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కథలోని ఎమోషన్ ఆడియన్స్ కు స్ట్రాంగ్ గా కనెక్ట్ అయితే ఈ సినిమా సర్ప్రైజ్ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక భారీ అంచనాల భారాన్ని మోస్తున్న సినిమా మాత్రం టాక్సిక్. గీతు మోహన్‌దాస్(geethu mohandas) ప్రత్యేకమైన విజువల్ స్టైల్, యష్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిలబెడుతున్నాయి. అయితే భారీ బడ్జెట్ ఉన్న సినిమాలకు కేవలం మంచి ఓపెనింగ్స్ సరిపోవు, లాంగ్ థియేట్రికల్ రన్ అవసరం. అందువల్ల ఈ మూడు సినిమాల్లో భారీ రిస్క్ కూడా టాక్సిక్ సినిమాదే అని చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రైటింగ్ బలం, ఫ్యామిలీ కనెక్ట్, మార్కెట్ మోమెంటమ్ దృష్ట్యా వెంకీ అట్లూరి సినిమా బాక్సాఫీస్ సక్సెస్‌కు అత్యంత బలమైన అభ్యర్థిగా కనిపిస్తుండగా, శివ నిర్వాణకు ఎమోషన్ ప్రధాన ఆయుధంగా, గీతు మోహన్‌దాస్‌కు అంచనాల ఒత్తిడి ప్రధాన సవాలుగా మారింది.








