Google నుంచి AI దిగ్గజాలు ఎగ్జిట్.. జీతాలు కాదు, అసలు సమస్య ఏంటి?
గూగుల్ దగ్గర డబ్బుకు కొదవ లేదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన AI infrastructure ఉంది. సొంతంగా తయారు చేసుకునే AI chips ఉన్నాయి. Geminiలాంటి భారీ AI ప్రాజెక్ట్ ఉంది. అయినా… అక్కడ పనిచేస్తున్న అత్యుత్తమ AI శాస్త్రవేత్తలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు.
రీసెంట్ గా Google DeepMind నుంచి Jeff Dean, Sanjay Ghemawat, Oriol Vinyals, Quoc Le వంటి కీలక పేర్లు బయటకు వెళ్లారు. అలాగే అంతకుముందే Geminiతో సంబంధం ఉన్న Noam Shazeer, John Jumper వంటి ప్రముఖ పరిశోధకులు కూడా OpenAI, Anthropic వంటి ప్రత్యర్థుల వైపు వెళ్లారు. ఎందుకిలా జరుగుతోంది
Google ఇచ్చే జీతాలు, సౌకర్యాలు సరిపోవడం లేదా?
ఒక సాధారణ ఉద్యోగి మరో కంపెనీకి వెళ్లేటప్పుడు ముందుగా చూసేది జీతం కావచ్చు. కానీ ప్రపంచంలోని అత్యుత్తమ AI researchers పరిస్థితి వేరు. వాళ్లకు ఇప్పటికే భారీ compensation ఉంటుంది. Google కూడా తన కీలక executives, talentకు కోట్ల డాలర్ల విలువైన equity awards ఇస్తోంది. మరి ఏంటి సమస్య అంటే.. వాళ్లు చూసేది ఇంకో విషయం.
“నేను ఎక్కడ పనిచేస్తే నా ఆలోచనకు ఎక్కువ విలువ వస్తుంది?” అదే ఇప్పుడు అసలు గేమ్. జీతం కంటే పెద్ద ఆకర్షణ: Equity + Freedom. AI రంగంలో OpenAI, Anthropic వంటి కంపెనీలు ఎదుగుతున్నాయి. ఇవి భవిష్యత్తులో మరింత భారీ విలువను సృష్టిస్తాయనే అంచనాలు ఉన్నాయి. అలాంటి సమయంలో ఒక top researcherకు అక్కడ లభించే equity చాలా ఆకర్షణీయంగా మారుతుంది.
అంటే… Googleలో ఉద్యోగిగా ఉండటం ఒక option. కానీ మరో AI సంస్థలో భవిష్యత్తు కంపెనీలో భాగస్వామి కావడం మరో option. ఇంకో అవకాశం ఇంకా పెద్దది. అది సొంత కంపెనీ పెట్టుకోవడం.
Jeff Dean, Sanjay Ghemawat, Oriol Vinyals, Quoc Le ఇప్పుడు కలిసి Discovery Loopను ప్రారంభించడం దీనికి ఉదాహరణ. వాళ్ల లక్ష్యం మరో chatbot తయారు చేయడం కాదు. AIతో శాస్త్రీయ పరిశోధన ప్రక్రియనే వేగవంతం చేయాలని చూస్తున్నారు.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. Google వాళ్లను ఉద్యోగులుగా కోల్పోయినా, Discovery Loopకు founding investorగా, cloud partnerగా ఉండబోతోంది. అంటే… Google నుంచి బయటకు వెళ్లిన talentను Google పూర్తిగా కోల్పోవడం లేదు; కానీ ఆ talentపై పూర్తి నియంత్రణ మాత్రం కోల్పోతోంది.
మరో పెద్ద సమస్య: AIకి కావాల్సిన “Compute”
ఇది సామాన్యుడికి కొంచెం టెక్నికల్‌గా అనిపించొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే… AI modelను తయారు చేయడానికి చాలా భారీ కంప్యూటింగ్ శక్తి కావాలి.Google దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన TPU chips ఉన్నాయి. కానీ సమస్య ఏమిటంటే వాటికి డిమాండ్ కూడా అంతే భారీగా ఉంది. Google Cloud customersకు compute కావాలి. Gemini projectsకు compute కావాలి. ఇతర AI research teamsకూ కావాలి.
దీంతో Googleలోని కొంతమంది researchers కూడా తమ research కోసం కావాల్సిన computing power పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని Los Angeles Times నివేదించింది. కొన్ని సందర్భాల్లో ఈ కొరత ఏ research projectకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ ప్రయోగాన్ని ముందుగా చేయాలి అనే దానిపైనా ప్రభావం చూపుతోందని ఆ కథనం పేర్కొంది.
ఇది AIలో చాలా కీలకం.
ఎందుకంటే… మంచి idea ఉండటం ఒక విషయం. దాన్ని పరీక్షించడానికి కావాల్సిన compute లేకపోవడం మరో విషయం. AI రేసులో కొన్ని నెలల ఆలస్యం కూడా పెద్ద తేడా తీసుకురాగలదు.
అయితే Googleకు వీళ్లు వెళ్లిపోవడం వల్ల నష్టం ఏమిటి?
ఒక సాధారణ ఉద్యోగి వెళ్లిపోతే కొత్త వ్యక్తిని నియమించుకోవచ్చు. కానీ Jeff Dean లేదా Oriol Vinyals స్థాయి వ్యక్తి వెళ్లిపోతే…అతని స్థానంలో మరో resume పెట్టడం అంత సులభం కాదు. ఎందుకంటే వాళ్ల దగ్గర కేవలం coding skills ఉండవు. కానీ సంవత్సరాల research experience ఉంటుంది.
ఏ సమస్యను పరిష్కరించాలి? ఏ research directionలో breakthrough వచ్చే అవకాశం ఉంది? ఏ ప్రయోగం పనిచేయదు? ఎవరితో కలిసి పనిచేయాలి? ఇలాంటి జ్ఞానం అంతా ఉంటుంది. అందుకే ఒక top researcher వెళ్లిపోతే… ఒక ఉద్యోగి మాత్రమే వెళ్లిపోయినట్లే కాదు.. అతనితో పాటు ఒక పెద్ద knowledge network కూడా బయటకు వెళ్లిపోయినట్లే.
ఇంకో ప్రమాదం ఉంది: ఒకరు వెళ్తే… మరొకరు కూడా వెళ్లొచ్చు
ఇదే Googleకు అత్యంత ప్రమాదకరమైన విషయం. ఒక ప్రముఖ scientist వెళ్లిపోయాడు.
అతనితో పనిచేసిన మరో researcherకు బయట మంచి అవకాశం వచ్చింది. అతను కూడా వెళ్లిపోయాడు.
మిగిలిన వాళ్లు అనుమానంగా చూస్తారు. “ఇక్కడ నా భవిష్యత్తు ఎలా ఉంటుంది?” అనే ప్రశ్న మొదలవుతుంది. ఇదే talent exodusగా మారవచ్చు.
ఇటీవలి Google departuresపై పెట్టుబడిదారుల ఆందోళనకు ఇదే కారణం. Geminiకి కీలకంగా పనిచేసిన పలువురు researchers ప్రత్యర్థి సంస్థలకు వెళ్లడం Google AI పోటీ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది.
అయితే Google నష్టపోయినట్లేనా?
అస్సలు కాదు. Google దగ్గర ఇప్పటికీ DeepMind, Google Research, Gemini, TPU infrastructure, Google Cloud, Search, YouTube వంటి అపారమైన బలాలు ఉన్నాయి. అంటే Google వద్ద AI రేసును గెలిచే సామర్థ్యం ఇంకా చాలా పెద్దదే. కానీ ఇప్పుడు ఆ సామర్థ్యానికి మరో విషయం జత కావాలి. Talent retention. ఎందుకంటే AIలో భవిష్యత్తును కేవలం డబ్బుతో కొనలేరు.
మీ దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన chips ఉండొచ్చు. వేల కోట్ల డాలర్ల budget ఉండొచ్చు. కానీ నెక్ట్స్ పెద్ద ఆలోచన చేసే మనిషి మీ దగ్గర లేకపోతే ఆ infrastructure అంతా ఎంతవరకు ఉపయోగపడుతుంది?అందుకే Googleలో జరుగుతున్నది కేవలం కొంతమంది ఉద్యోగులు కంపెనీ మారుతున్న కథ కాదు. ఇది AI ప్రపంచంలో మొదలైన కొత్త యుద్ధానికి సంకేతం.
ఇప్పుడు పోటీ…
“ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది?” అన్నది మాత్రమే కాదు. “ఎవరి దగ్గర ప్రపంచంలోని అత్యుత్తమ AI brains ఎక్కువకాలం ఉంటాయి?” అనేదే. అందుకే Googleకు ఇప్పుడు అసలు పరీక్ష Geminiని మరింత తెలివిగా తయారు చేయడం మాత్రమే కాదు… Geminiని తెలివిగా తయారు చేసే వాళ్లను తన దగ్గరే ఉంచుకోవడం.








