ఇళ్ల ధరల్లో ఒడిదుడుకులు.. 2026లో ఇల్లు కొనేవారికి నిపుణుల సూచనలు ఇవే!
ఇళ్ల ధరలు అకస్మాత్తుగా పడిపోవడం లేదా డిమాండ్ కంటే ఇళ్ల సరఫరా విపరీతంగా పెరిగిపోవడం వంటి పరిస్థితులను ‘హౌసింగ్ మార్కెట్ క్రాష్’ (Housing Market) అంటారు. ఆర్థిక మాంద్యం నుంచి అధిక తనఖా (Mortgage) రేట్ల వరకు అనేక అంశాలు దీనికి కారణమవుతాయి. మరి 2026లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉందా? అంటే.. నిపుణులు లేదనే సమాధానం ఇస్తున్నారు.
మార్కెట్ క్రాష్ కాదు.. ఇది కరెక్షన్ మాత్రమే!
2026లో హౌసింగ్ మార్కెట్ (Housing Market) కుప్పకూలే అవకాశాలు లేవని, కోవిడ్ తర్వాత ఏర్పడిన అస్థిరత తగ్గి మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. “మనం మార్కెట్ క్రాష్ దిశగా వెళ్లడం లేదు. స్థిరత్వంతో కూడిన కరెక్షన్ దశలో ఉన్నాం” అని హోవార్డ్ హన్నా రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సీఈఓ హోబీ హన్నా స్పష్టం చేశారు. 2008 నాటి పరిస్థితులతో పోలిస్తే నేటి పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. గృహయజమానుల వద్ద రికార్డు స్థాయిలో ఈక్విటీ ఉండటం, పటిష్టమైన రుణ మంజూరు విధానాలు అమలులో ఉండటమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగాల కోత ముప్పు ఉందా?

గతేడాది 9,66,000 ఉద్యోగావకాశాలు తగ్గినప్పటికీ, పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదు. ఏడీపీ (ADP) నేషనల్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ప్రకారం 2026 జూన్ నెలలో ప్రైవేట్ రంగంలో కొత్తగా 98,000 ఉద్యోగాలు పెరిగాయి. అలాగే ఉద్యోగుల వేతనాలు కూడా గతేడాదితో పోలిస్తే 4.4% మేర పెరిగాయి. ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో నియామకాలు నిలకడగా ఉన్నాయని ఏడీపీ చీఫ్ ఎకనామిస్ట్ నెలా రిచర్డ్సన్ తెలిపారు. కాబట్టి ఉద్యోగాల మార్కెట్ కుప్పకూలే పరిస్థితులు లేనందున, అది హౌసింగ్ క్రాష్‌కు (Housing Market) దారితీయదని నిపుణులు భావిస్తున్నారు.
నిలకడగా ఇళ్ల ధరల వృద్ధి

ఇళ్ల ధరలు పడిపోవడం లేదు, అలాగని 2025 ప్రారంభంలో ఉన్నంత వేగంగా కూడా పెరగడం లేదు. కోటాలిటీ (Cotality) డేటా ప్రకారం.. 2026 ఏప్రిల్‌లో 0.4% ఉన్న వార్షిక ఇళ్ల ధరల వృద్ధి, మే నెలాఖరుకు 0.8% కి చేరింది.
డిమాండ్ – సరఫరా మధ్య అంతరం

మార్కెట్ క్రాష్ (Housing Market) కావాలంటే డిమాండ్ కంటే సరఫరా చాలా ఎక్కువగా ఉండాలి. సాధారణ మార్కెట్లో ఇళ్ల సరఫరా ఆరు నెలల పాటు ఉంటే, 2008 సంక్షోభం సమయంలో అది ఏకంగా 13 నెలలకు చేరింది. కానీ 2026 మే నాటికి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ (NAR) డేటా ప్రకారం ఇళ్ల సరఫరా కేవలం 4.5 నెలలు మాత్రమే ఉంది. మరోవైపు ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల (ముఖ్యంగా ఇరాన్ వివాదం) కారణంగా జూలై నాటికి 30 ఏళ్ల ఫిక్స్డ్ మోర్ట్గేజ్ రేటు సగటున 6.58% కి చేరింది.
ఎలా సన్నద్ధం కావాలి?
భవిష్యత్తులో హౌసింగ్ మార్కెట్ (Housing Market) ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి ఆర్థిక నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు:
ఎమర్జెన్సీ ఫండ్: కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడా నగదును బ్యాంకులో ఉంచుకోవాలి.అప్పుల తగ్గింపు: అధిక వడ్డీ ఉండే క్రెడిట్ కార్డ్ వంటి అప్పులను ముందుగా తీర్చేయాలి.బడ్జెట్లో కొనుగోలు: మార్కెట్ పరిస్థితి ఎలా ఉన్నా, సులభంగా ఈఎంఐ (EMI) కట్టగలిగే ఇళ్లనే ఎంచుకోవాలి.
ఫిక్స్డ్ రేట్ మోర్ట్గేజ్: వడ్డీ రేట్ల పెరుగుదల ముప్పు లేకుండా, స్థిరమైన ఈఎంఐ చెల్లించేలా ఫిక్స్డ్ రేట్ మోర్ట్గేజ్ తీసుకోవడం ఉత్తమం.ఏదేమైనా 2026 ఇల్లు కొనడానికి అనువైన సంవత్సరమా అంటే.. అది ఎవరి వ్యక్తిగత ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగ భద్రత, అప్పుల తీరుపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.








