విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యకలాపాలు
రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక దక్షిణ కోస్తా రైల్వేజోన్ (Railway Zone) ఎట్టకేలకు పట్టాలెక్కింది. విశాఖపట్నం (Visakhapatnam) కేంద్రంగా నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. నగరంలోని వీఎంఆర్డీఏ డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. జోన్కు సంబంధించిన మెకానికల్ టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలన వ్యవహారాలన్నీ అక్కడి నుంచే సాగనున్నాయి. సీసీఆర్వోనూ నియమించారు. ఇప్పుడున్న గుంతకల్లు (Guntakal ), గుంటూరు (Guntur), విజయవాడ (Vijayawada)లతో పాటు విశాఖపట్నం కలిపి నాలుగు డివిజన్లతో జోన్ పని చేస్తుంది. 130 ఏళ్ల చరిత్ర కలిగి వాల్తేరు డివిజన్ కనుమరుగైంది.
ఇవి కూడా చదవండి







