హైదరాబాద్‌లో ఎండ తీవ్రతతో పాటు సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విజయవాడ, గుంటూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో పగటిపూట ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం జల్లులు పడవచ్చు.
కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే వీలుంది.
రాగల 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది.
ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని ఐఎండీ హెచ్చరిక.