జులైలో ‘టీటీఏ మెగా కన్వెన్షన్ ‘.. వెండర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telugu Association – TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “టీటీఏ మెగా కన్వెన్షన్ 2026″ (TTA Mega Convention 2026) వేడుకలకు సంబంధించి వెండర్ రిజిస్ట్రేషన్లు (Vendor Registrations) అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర అమెరికాలో జరగనున్న ఈ పెద్ద కార్యక్రమంలో తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడానికి వ్యాపారవేత్తలు, ప్రదర్శకులను నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.
మహాసభల వివరాలు..
ఈ మెగా కన్వెన్షన్ 2026, జులై 17 నుండి 19 వరకు నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ (Charlotte Convention Center – 501 S College St, Charlotte, NC) లో వైభవంగా జరగనుంది.
ఇవి కూడా చదవండి
ప్రదర్శనల విభాగాలు..
వ్యాపారాలను విస్తరించుకోవడానికి “Showcase. Connect. Grow.” అనే నినాదంతో కింది విభాగాలకు చెందిన వారు తమ స్టాళ్లను ఇక్కడ రిజర్వ్ చేసుకోవచ్చు.
- జ్యువెలరీ (Jewelry)
- రియల్ ఎస్టేట్ & కార్పొరేట్ (Real Estate & Corporate)
- జెమ్స్ & ఆర్టిఫిషియల్ జ్యువెలరీ (Gems & Artificial Jewelry)
- అపారెల్ & క్లోథింగ్ బోటిక్స్ (Apparel & Clothing Boutiques)
- ఇన్సూరెన్స్ & టెలికాం (Insurance & Telecom)
- ఫైనాన్షియల్ & వెబ్ ఎడ్యుకేషన్ (Financial & Web Education)
- ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ (Arts & Crafts)
సంప్రదించాల్సినది..
స్టాళ్ల రిజర్వేషన్ , మరింత సమాచారం కోసం కింది ప్రతినిధులను సంప్రదించవచ్చు..
- భరత్: +1 (860) 970-8983
- అరుణ్: +1 (954) 554-6286
- శ్వేత: +1 (408) 717-0877
నిర్వాహకులు..
ఈ మహాసభలను టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి , శేఖర్ రెడ్డిల పర్యవేక్షణలో కమిటీ సభ్యులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఆసక్తి గల వ్యాపారవేత్తలు అధికారిక లింక్ ద్వారా లేదా www.ttaconvention.org వెబ్సైట్ను సందర్శించి తమ స్థానాన్ని వెంటనే రిజర్వ్ చేసుకోవాలని టీటీఏ చాప్టర్ ప్రతినిధులు కోరారు.
ఇవి కూడా చదవండి








