లెబనాన్ పై పోరు ఇజ్రాయెల్ కీలక అడుగు.. బ్యూ ఫోర్ట్ కాజిల్ స్వాధీనం…!
లెబనాన్ పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. వ్యూహాత్మక భాగాలను ఆక్రమిస్తోంది. లేటెస్టుగా దక్షిణ లెబనాన్ లోని అత్యంత కీలకమైన బ్యూఫోర్ట్ క్యాజిల్‌ను స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన గోలానీ బ్రిగేడ్ దళాలు .. ఈకోటపై ఇజ్రాయెల్ ఫ్లాగ్ ఎగురవేశాయి. దీంతో ఇజ్రాయెల్ కు.. యుద్ధక్షేత్రంలో లీడింగ్ ఎడ్జ్ దక్కనుంది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దళాలు భారీగా దాడులు చేసిన మర్నాడే తిరిగి ఈ కోటను ఐడీఎఫ్ స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ లెబనాన్, ఉత్తర ఇజ్రాయెల్‌పై నిఘా పెట్టడానికి ఈ కోట అత్యంత వ్యూహాత్మక ప్రదేశం. ఈ ప్రాంతంలోని రాకెట్ లాంచింగ్ వ్యవస్థలపై తాము దృష్టి పెట్టబోతున్నట్లు ఇజ్రాయెల్ బలగాలు వెల్లడించాయి.
‘‘బ్యాటిల్ ఆఫ్ బ్యూఫోర్ట్ ముగిసిన 44 ఏళ్ల తర్వాత తమ దళాలు తిరిగి ఆ కోటపై పతకాలను ఎగురవేశాయి’’ అని ఆ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ఈ కోట స్వాధీనం చేసుకోవడానికి యుద్ధ విమానాల సాయంతో ఇజ్రాయెల్ దళాలు భారీ ఎత్తున బాంబింగ్ చేయడంతోపాటు భూతల పోరాటం కూడా చేశాయి.
1982 తొలి లెబనాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ దళాలు ఈ కోటను మొదటిసారి స్వాధీనం చేసుకొన్నాయి. నాడు కూడా గోలానీ బ్రిగేడే పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ దళాలతో పోరాడి.. ఈ కోటను ఆక్రమించాయి. నాటి నుంచి 2000 సంవత్సరం వరకు ఇది ఇజ్రాయెల్ అధీనంలోనే ఉంది.
ఇవి కూడా చదవండి








