ఆ వర్గానికి ‘పెద్ది’ మంచి బూస్ట్‌గా మారనుందా?
విజయవాడలో ఘనంగా నిర్వహించిన పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్(Peddi Pre Release Event) లో సీనియర్ నటుడు జగపతి బాబు(jagapathi babu) చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రామ్ చరణ్(ram charan) ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సానా(buchibabu sana) తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమాపై ఆయన అపార నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం థియేటర్ రంగం ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, పెద్ది(Peddi) సినిమా ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఈ సినిమా పెద్ద బలం అవుతుందని పేర్కొంటూ, రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద సంచలన ఫలితాలు నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడిన జగపతి బాబు, ఆయనలోని నటుడి పరిణతి ప్రతి సినిమాతో కొత్త స్థాయికి చేరుకుంటోందని కొనియాడారు. నటన మాత్రమే కాదు, వ్యక్తిత్వం, వినయం, సహచరుల పట్ల చూపించే గౌరవం కూడా చరణ్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వారసత్వాన్ని గౌరవంగా ముందుకు తీసుకెళ్తున్న చరణ్‌తో మళ్లీ మళ్లీ కలిసి నటించడానికి తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పారు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా కథను తెరకెక్కించిన తీరు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చూపించిన విజువల్ గ్రాండియర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు.
పెద్దిలో తనకు లభించిన పాత్ర కెరీర్లో ఎంతో ప్రత్యేకమైందని జగపతి బాబు వెల్లడించారు. చాలా కాలం తర్వాత నటుడిగా కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఈ సినిమాతో దక్కిందని తెలిపారు. నిర్మాత వెంకట సతీష్ కిలారు(Venkata satish Kilaru) నిర్మాణ విలువల్లో ఎలాంటి రాజీ పడకుండా సినిమాను రూపొందించారని, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(AR Rahman)తో పనిచేయడం గొప్ప అనుభవమని చెప్పారు. జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, జగపతి బాబు వ్యాఖ్యలు ఆ ఆసక్తిని మరింత పెంచాయి.
ఇవి కూడా చదవండి








