రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా … ఆ విషయంలో ముందుకెళ్లాలి : పవన్ కల్యాణ్
పరిశ్రమలు (Industries), ప్రైవేటు విద్యా సంస్థలు (Private Educational Institutions) సరిగా పన్నులు చెల్లించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ అధికారులతో గ్రామపంచాయతీలకు రావాల్సిన పన్నులపై పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ లాభాలు సంపాదించే పరిశ్రమలు పంచాయతీలకు పన్నులు చెల్లించకపోతే ఎలా? అని అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో వనరులు వాడుకుంటూ పన్నులు కట్టకపోవడమేంటి? ఆంధ్రా పేపర్ మిల్స్ (Andhra Paper Mills) రూ.19 కోట్లు బకాయిలు పెట్టింది. విద్యాసంస్థలకు సంబంధించి కూడా భారీగా బకాయిలు ఉన్నాయి. రాష్ట్రంలో పంచాయతీ పన్నులు వసూలైతే రూ.5,400 కోట్లకు పైగా వస్తాయి. పేదలు, కులవృత్తులవారు, చిరుగ్యోగులు కూడా పన్నులు చెల్లిస్తున్నారు. పరిశ్రమలు, విద్యా సంస్థలు పన్నులు కట్టని విషయం ప్రజలకు తెలియదు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా పన్ను వసూళ్ల విషయంలో ముందుకెళ్లాలి. సీఎంతో పాటు మంత్రివర్గంతోనూ నేను మాట్లాడతా? పల్స్ సర్వే తరహాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్ను వసూళ్ల కార్యాచరణ చేపట్టాలి అని అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు.
ఇవి కూడా చదవండి








