ఈ కుట్రలో టీడీపీని ఇరికించేందుకు వైసీపీ ప్రయత్నం : మంత్రి అనగాని
ఇకనైనా కుల, మత విధ్వంసాలు, రెచ్చగొట్టే కుట్రలను వైసీపీ వీడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) అన్నారు. నంద్యాల వైఎస్సార్ విగ్రహం (YSR Statue) ధ్వంసం ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ విగ్రహాన్ని వైసీపీ వాళ్లే ధ్వంసం చేసి టీడీపీ (TDP)పై నెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు. దుష్ప్రచారాలు చేయడమే వైసీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారు. వైసీపీ నాయకుడు జంబులయ్య (Jambulayya)నే విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తేలింది. ఈ కుట్రలో టీడీపీని ఇరికించేందుకు వైసీపీ ప్రయత్నం చేసింది. విగ్రహ ధ్వంసం కుట్ర బహిర్గతం కాగానే దృష్టి మళ్లించడానికి డీఎస్పీపై పడ్డారు. యువత బాగుండకూడదనే కుట్రతో డీఎస్సీపై గొడ్డలి పార్టీ అసత్య ప్రచారం చేస్తోంది. అవినీతి బయపటడే కొద్దీ గొడ్డలి పార్టీ అధినేతలో ఆక్రోశం పెరుగుతోంది. ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా మీ అవినీతికి శిక్షలు తప్పవు. పీఏలు, పీఏల బినామీల బాగోతమంతా బయటపెట్టి తీరుతాం అని అన్నారు.
ఇవి కూడా చదవండి








