పెద్ది లాంటి సినిమా పదేళ్లకు ఓ సారి వస్తుంది
విజయవాడలో ఘనంగా నిర్వహించిన పెద్ది ప్రీ రిలీజ్ వేడుక(Peddi Pre Release Event)లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సినిమా గురించి మాట్లాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమా తనకు కేవలం మరో ప్రాజెక్ట్ కాదని, ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరించే ప్రత్యేక కథగా భావించానని ఆయన వెల్లడించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) కథను వివరించిన క్షణం నుంచే దానితో భావోద్వేగంగా అనుసంధానమయ్యానని చెప్పారు. సాధారణ కమర్షియల్ కథలకంటే భిన్నంగా, ఎన్నో సార్లు జీవితంలో కిందపడినా మళ్లీ నిలబడే వ్యక్తి పోరాట స్ఫూర్తిని ఈ సినిమా ప్రతిబింబిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని అందరూ చెబుతున్నప్పటికీ, నిజానికి అద్భుతమైన కథ దొరికినప్పుడు ఆ కష్టం అనిపించదని చరణ్ పేర్కొన్నారు. కొన్ని కథలు ఆకట్టుకుంటాయని, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయని, అయితే చాలా అరుదుగా మాత్రమే మనసును కదిలించే కథలు వస్తాయని చెప్పారు. పెద్ది అలాంటి అరుదైన కథలలో ఒకటిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. గతంలో మగధీర(magadheera), రంగస్థలం(rangasthalam), ఆర్ఆర్ఆర్(RRR) సినిమాల టైమ్ లో అనుభవించిన ఉత్సాహమే ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా కలిగిందని వెల్లడించారు.
అలాగే ఈ సినిమా తన నట జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని చరణ్ అన్నారు. నటుడిగా తనకు అపారమైన సంతృప్తిని ఇచ్చిన సినిమాగా పెద్ది(Peddi) నిలిచిందని పేర్కొన్నారు. అభిమానుల ప్రేమ, ప్రోత్సాహమే ఇలాంటి సవాళ్లతో కూడిన కథలను ఎంచుకునే ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. తనకు తెలిసింది సినిమా మాత్రమేనని, ప్రేక్షకులను అలరించడం తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. చివరి శ్వాస వరకు మంచి సినిమాలతో అభిమానుల ప్రేమకు ప్రతిఫలం ఇవ్వడానికి కృషి చేస్తానని ఆయన భావోద్వేగంగా తెలిపారు.
ఇవి కూడా చదవండి








