అట్లాంటాలో ముగిసిన టామా ‘శ్రీ విద్యోపాసన’ కార్యక్రమం
TAMA: టామా (Telugu Association of Metro Atlanta – TAMA) ఆధ్వర్యంలో జార్జియాలోని సువానీ నగరంలో గల ‘శిరిడి సాయి టెంపుల్ ఆఫ్ అట్లాంటా’ వేదికగా నిర్వహించిన “శ్రీ విద్యోపాసన” కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, విజయవంతంగా ముగిసింది.
కాలావాహన ప్రక్రియ..
ఈ కార్యక్రమంలో రాధ , రమ ఈ విశేష పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజలో భాగంగా, అక్కడకు విచ్చేసిన భక్తజన సమూహమంతటికీ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ‘కాలావాహన’ (Kalavahana) ప్రక్రియను లోతుగా వివరించడంతో పాటు దానిని ప్రత్యక్షంగా ప్రదర్శించారు.
ప్రశంసలు..
ఈ విశిష్ట ఆధ్యాత్మిక ప్రక్రియను అర్థం చేసుకోవడం, దాని విశేషాలను తెలుసుకోవడం తమకు ఎంతో మంచి అనుభూతిని ఇచ్చిందని పాల్గొన్న భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక తెలుగు సమాజానికి భారతీయ సనాతన సంప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే దిశగా టామా చేపట్టిన ఈ ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక భక్తులు, టామా ప్రతినిధులు పాల్గొన్నారు.








