టాలీవుడ్ లో కమ్‌బ్యాక్ ట్రెండ్
టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. భారీ బడ్జెట్లు, వంద కోట్ల కలెక్షన్ల కంటే.. కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోలు, హీరోయిన్లు తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇండస్ట్రీలో ఇది కమ్‌బ్యాక్ సీజన్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రామ్ చరణ్(ram charan)కు పెద్ది(peddi) సక్సెస్, అఖిల్(Akhil)కు లెనిన్(lenin) సక్సెస్ కెరీర్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అఖిల్ అందుకున్న క్లీన్ హిట్ ఆయన కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. మరోవైపు సమంత(samantha) మా ఇంటి బంగారం(Maa inti bangaram) సక్సెస్ తో తన మార్కెట్‌పై వస్తున్న సందేహాలకు సమాధానం ఇచ్చింది. ముఖ్యంగా వంద కోట్ల క్లబ్‌లోకి ఈ సినిమా చేరడం ఆమెకు మరింత బలాన్ని ఇచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై కూడా ఈ ఫలితం కొత్త నమ్మకాన్ని పెంచే అవకాశముంది.
వరుణ్ తేజ్(varun Tej)కు కొరియన్ కనకరాజు(korean kanakaraju) సక్సెస్ కూడా ఇదే తరహాలో ఊరటనిచ్చింది. వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సక్సెస్‌తో ఆయన కెరీర్ మళ్లీ గాడిలో పడినట్టైంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో తాజాగా రవితేజ(raviteja) కూడా చేరిపోయారు. వరుస ఫ్లాపులతో ప్రభావితమైన రవితేజ మార్కెట్‌కు ఇరుముడి(irumudi) మంచి బూస్ట్ ఇచ్చింది. రిలీజైన మొదటి రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేరుకోవడంతో సినిమా లాభాల బాట పట్టింది.
ఈ సక్సెస్ తో డైరెక్టర్ శివ నిర్వాణ(shiva nirvana)కు కూడా స్ట్రాంగ్ రీఎంట్రీ దక్కినట్టైంది. గత సినిమాతో నిరాశ ఎదురైన ఆయనకు ఇరుముడి రిజల్ట్ ఊరటనిచ్చింది. ఇక హిట్ కోసం ఎదురుచూస్తున్న మరికొందరు స్టార్ల సినిమాలు కూడా వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. వారి ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కమ్‌బ్యాక్ ట్రెండ్ ఇంకెంతకాలం కొనసాగుతుందో చూడాలి.








