కికు చిరంజీవి ప్రమోషన్స్‌లో హీరో సెన్సేషనల్ కామెంట్స్
కికు యనమల(kiku yanamala), కాశిష్ ఖాన్(kasish khan) జంటగా నటించిన సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ కికు చిరంజీవి(kiku chiranejeevi) ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కికు ఎంటర్టైన్మెంట్స్(Kiku entertainments) బ్యానర్‌పై దీప్తి నడిమింటి(Deepti Nadiminti) నిర్మించిన ఈ సినిమాకు సుభ సాయి వెంకట్ (Subha sai venkat) దర్శకత్వం వహించారు. శేఖర్ చంద్ర(sekhar chandra) సంగీతం అందించిన ఈ సినిమా లో ఈశ్వరి రావు(eswari rao), తనికెళ్ల భరణి(tanikella Bharani), గోపరాజు రమణ(goparaju ramana), శ్రీకాంత్ అయ్యంగార్(Srikanth iyengar) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో హీరో కికు యనమల ఈ మూవీ జర్నీలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
తమలాంటి కొత్త నటీనటుల సినిమాలకు మీడియా అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో కీలకమని కికు పేర్కొన్నారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు సీనియర్ నటులు తమ సినిమాకు అండగా నిలిచారని చెప్పారు. సినిమాలో నటించడంతో పాటు ప్రచారానికి కూడా సహకరించిన శ్రీకాంత్ అయ్యంగార్, అలీ, తనికెళ్ల భరణి, ఈశ్వరి రావు వంటి వారి మద్దతు తమకు ఎంతో బలాన్నిచ్చిందని తెలిపారు.
అయితే ప్రమోషన్స్‌లో భాగంగా కాలేజ్ ఈవెంట్ల విషయంలో మాత్రం నిరాశ ఎదురైందని కికు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో కార్యక్రమం నిర్వహించేందుకు ముందుగానే పర్మిషన్ తీసుకున్నప్పటికీ, ఆ తర్వాత కాలేజ్ టీమ్ నుంచి రెస్పాన్స్ రాలేదని చెప్పారు. ఇటీవల అదే వేదికపై భారీ స్థాయి సినిమా ఈవెంట్ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తమలాంటి చిన్న సినిమాలకు కనీస అవకాశం కూడా దక్కకపోవడం బాధ కలిగించిందన్నారు. థియేటర్ వద్ద తమ పోస్టర్ తొలగించి మరో సినిమా పోస్టర్ ఏర్పాటు చేసిన ఘటన కూడా తనను కలిచివేసిందని తెలిపారు.
సినిమాను మొదలుపెట్టినప్పటి నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం వరకు ఎన్నో ఛాలెంజెస్ ను ఎదుర్కొన్నామని కికు చెప్పారు. అయినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా తమ ప్రయత్నాన్ని కొనసాగించామని తెలిపారు. కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారు ఇలాంటి అడ్డంకులను ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని, టాలెంట్‌పై నమ్మకంతో ముందుకు సాగాలని సూచించారు. అన్ని కష్టాలను దాటుకుని ఆగస్టు 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.








