నక్షత్రకు ధనుష్ ప్రశంసలు
ఇరుముడి(Irumudi) సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమాకు కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్తో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను అందుకుంటున్నాయి. ముఖ్యంగా రవితేజ(Raviteja)తో పాటు ఆయన కూతురు పాత్రలో నటించిన బాలనటి బేబీ నక్షత్ర(Nakshatra) నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
సినిమా సక్సెస్ మీట్ తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva Nirvana) ఏర్పాటు చేసిన ఓ స్పెషల్ వీడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్‌తో బేబీ నక్షత్రకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా చిన్నారి యాక్టింగ్‌ను చూసిన ధనుష్ ఆమె టాలెంట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. నక్షత్ర కూడా ఈ అరుదైన సందర్భాన్ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంది.
ఈ వీడియోలో ధనుష్ చెప్పిన మాటలు నక్షత్రకు మరింత ప్రత్యేకంగా మారాయి. ఫ్యూచర్లో ఇద్దరూ కలిసినప్పుడు ఆమె దగ్గర నుంచి యాక్టింగ్ నేర్చుకోవాలని ఉందంటూ సరదాగా చెప్పిన ధనుష్.. ఆమె పెర్ఫార్మెన్స్పై ప్రశంసలు కురిపించారు. అలాగే కెరీర్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. దీంతో ఈ వీడియో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని సొంతం చేసుకుంటోంది.
ఇక ఇరుముడి సక్సెస్ఫుల్ థియేట్రికల్ రన్‌ను కొనసాగిస్తోంది. సినిమాలో నక్షత్ర పోషించిన పాత్ర, ఆమె కనబరిచిన ఎమోషనల్ యాక్టింగ్ ఆడియన్స్ డిస్కషన్స్ లో నిలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మాణంలో శివ నిర్వాణ(shiva Nirvana) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే మంచి కలెక్షన్లను అందుకోగా, రానున్న రోజుల్లో మరిన్ని బాక్సాఫీస్ మైలురాళ్లను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.








