2026లో సూర్య హ్యాట్రిక్?
2026 సూర్య(Suriya) కెరీర్లో స్పెషల్ ఇయర్ గా మారుతోంది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ స్టార్ హీరో, ఒకే సంవత్సరంలో మూడో సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరుప్పు(Karuppu)తో భారీ సక్సెస్‌ను అందుకున్న సూర్య, ఆ తర్వాత వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath and sons) తోనూ మంచి ఫలితాన్ని అందుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆయన తదుపరి ప్రాజెక్టులపై ఫ్యాన్స్ లో ఆసక్తి మరింత పెరిగింది.
ఈ క్రమంలో సూర్య 47వ సినిమా 2026 దీపావళి రిలీజ్ కు రెడీ అవుతున్నట్టు సమాచారం. జీతూ మాధవన్(Jeethu madhavan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. నజ్రియా నజీమ్(nazriya Nazim), నస్లెన్(Naslen) కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
దీపావళి సీజన్లో సినిమాలకు భారీగా ప్రేక్షకాదరణ లభించే అవకాశం ఉండటంతో ఈ సినిమాను అదే సమయంలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తమిళనాడులో ఇప్పటికే పలు క్రేజీ సినిమాలు పండుగ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ విషయంలో పోటీ నెలకొనే అవకాశముంది. ఈ అంశంపై సూర్య త్వరలో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే రెండు సక్సెస్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకు ఈ సినిమా కీలకంగా మారనుంది. వరుస హిట్ల జోరును కొనసాగిస్తూ ఒకే ఏడాదిలో మూడు సక్సెస్‌లను అకౌంట్లో వేసుకుంటే అది ఆయన కెరీర్లో ప్రత్యేకమైన రికార్డుగా నిలిచే అవకాశం ఉంది. సూర్య సొంత నిర్మాణ సంస్థ జ్ఞాగరం స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








