స్పిరిట్ కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం..
స్పిరిట్(spirit) కోసం ప్రభాస్(prabhas) తీసుకున్న డెసిషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) కథను నెరేట్ చేసిన టైమ్ లోనే సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలపై ప్రభాస్‌తో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. కథపై నమ్మకంతో పాటు డైరెక్టర్ విజన్, వర్కింగ్ స్టైల్‌కు ప్రభాస్ పూర్తి స్థాయిలో అంగీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో యాక్షన్ సీన్స్ విషయంలో ప్రత్యేకంగా తీసుకున్న డెసిషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సినిమాలో భారీ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటంతో, వాటిని స్వయంగా చేయాలని ప్రభాస్‌ను సందీప్ కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాడీ డబుల్‌ను ఉపయోగించకుండా కీలక స్టంట్స్‌ను ప్రభాస్‌తోనే చేయించాలన్నది డైరెక్టర్ ఆలోచనగా చెబుతున్నారు. దీనికి ప్రభాస్ కూడా అంగీకరించడంతో ఇప్పటివరకు పూర్తైన షూటింగ్లో ఆయన ప్లేస్ లో డూప్‌ను వినియోగించలేదని చిత్ర వర్గాల సమాచారం.
ఇటీవల ది రాజా సాబ్(The raja saab) లో కొన్ని యాక్షన్ సీన్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్ ప్రభాస్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ అంశంపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను కూడా ఆయన గమనించారని, స్పిరిట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం. సందీప్ రెడ్డి వంగా సూచనలకు అనుగుణంగా యాక్షన్ పార్ట్‌ను పూర్తి చేయడానికి ప్రభాస్ సిద్ధంగా ఉన్నట్లు టాక్.
ప్రస్తుతం స్పిరిట్ షూటింగ్ దాదాపు 40% పూర్తయినట్లు తెలుస్తోంది. ఫౌజీ(fauzi) షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ మళ్లీ ఈ యాక్షన్ డ్రామా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ముందుగా 2027 మార్చిలో రిలీజ్ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, షూటింగ్ షెడ్యూల్‌ను బట్టి రిలీజ్ ప్లాన్‌లో మార్పులు ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. మొత్తం షూటింగ్ పూర్తైన తర్వాత కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.








