మే 3న అట్లాంటాలో ‘టామా’ ఆధ్వర్యంలో పికల్బాల్ టోర్నమెంట్
TAMA: అట్లాంటా తెలుగు సమాజం కోసం నిరంతరం వైవిధ్యభరితమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA), తన 45 ఏళ్ల వేడుకల్లో భాగంగా క్రీడాభిమానుల కోసం ఒక ప్రత్యేక పోటీని ప్రకటించింది. వచ్చే నెల మే 3, ఆదివారం రోజు అల్ఫారెట్టాలోని నార్త్ పార్క్ టెన్నిస్ & పికల్బాల్ సెంటర్ వేదికగా ‘టామా పికల్బాల్ టోర్నమెంట్-2026’ నిర్వహించనున్నారు.
టోర్నమెంట్ వివరాలు..
- తేదీ: మే 3, 2026 (ఆదివారం)
- సమయం: ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు.
- వేదిక: North Park Tennis & Pickleball Center, 13450 Cogburn Road, Alpharetta, GA 30004.
కేటగిరీలు..
క్రీడాకారుల ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ టోర్నమెంట్ను మూడు కేటగిరీలుగా విభజించారు.
- మెన్స్ డబుల్స్ (Men’s Doubles)
- విమెన్స్ డబుల్స్ (Women’s Doubles)
- మిక్స్డ్ డబుల్స్ (Mixed Doubles)
ప్రవేశ రుసుము..
ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు https://www.TAMA.org/pickleball వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తికి మొదటి ఈవెంట్కు 25 డాలర్లు, రెండో ఈవెంట్కు 10 డాలర్లుగా ప్రవేశ రుసుమును నిర్ణయించారు.
క్రీడా స్ఫూర్తిని చాటుతూ, చురుగ్గా కదులుతూ విజేతలుగా నిలవాలని ‘టామా’ స్పోర్ట్స్ బృందం పిలుపునిచ్చింది. మరిన్ని వివరాల కోసం టామా అధ్యక్షుడు సునీత పొట్నూరు (404-988-9429), స్పోర్ట్స్ అండ్ యూత్ సెక్రటరీ హరికృష్ణ అద్దంకి (470-263-5228) లేదా ఛైర్మన్ మధుకర్ యర్లగడ్డ (913-609-3563)ను సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి








