కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం .. తెలంగాణలో
కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. తెలంగాణ, ఒడిశా (Odisha), బిహార్ (Bihar), రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ (Telangana)లో ఆర్మూర్ -జగిత్యాల- మంచిరాల్య హైవే ( హెన్హెచ్ 63) విస్తరణకు ఆమోదం తెలిపింది. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో విస్తరణకు అంగీకారం చెప్పింది. జగిత్యాల-కరీంనగర్ (Karimnagar) జాతీయ రహదారి (ఎన్హెచ్ 563) విస్తరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బీవోటీ పద్ధతిలో విస్తరించనున్నట్లు చెప్పింది. రూ.7,597 కోట్లతో 190 కిలోమీటర్ల మేర రెండు జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నారు.








