బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమ్రాట్ చౌదరి
బిహార్ లో 20 ఏళ్ల తర్వాత అధికార మార్పిడి జరిగింది. ఇందులో భాగంగా బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ లోని లోక్ భవనల్ లో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ సందర్బంగా బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ సమ్రాట్ చౌదరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత జేడీయూ ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక.. బిహార్ 24 వ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ రాజకీయ చరిత్రలోనే మొదటి సారిగా బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు సమ్రాట్ చౌదరి కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సమ్రాట్ చౌదరికి పాశ్వాన్ శుభాకాంక్షలు తెలిపారు.








