బిహార్ నూతన సీఎంగా సమ్రాట్ చౌదరి, డిప్యూటీగా నితీశ్ కుమారుడు..
రాజ్యసభ ఎంపీగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తదుపరి ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరన్న దానిపై ఉత్కంఠత నెలకొంది. అలాగే నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఏ తేదీన అన్న దానిపై కూడా ఉత్కంఠత కొనసాగుతోంది. అయితే.. ఈ నెల 14 న ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజకీనామా చేయనున్నట్లు తాజా సమాచారం. అదే రోజు కొత్త ముఖ్యమంత్రి, మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.
అంతేకాకుండా కొత్త మంత్రివర్గంలో ఎవరెవరు మంత్రులుగా ప్రమాణం చేస్తారు? అన్న దానిపై కూడా మబ్బులు వీడిపోతున్నాయి. జేడీయూ, బీజేపీ మధ్య ఇప్పటికే ఫైనల్ లిస్ట్ తయారైందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం కొత్త ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి అయ్యే అవకాశాలున్నాయి. అదే విధంగా జేడీయూ కోటాలో డిప్యూటీ సీఎంగా నిశాంత్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
అలాగే జేడీయూ నుంచి మంత్రులుగా
నిశాంత్ కుమార్ – డిప్యూటీ సీఎం, విజయేంద్ర యాదవ్, విజయ్ కుమార్ చౌదరి, శ్రవణ్ కుమార్, అశోక్ చౌదరి, లేసీ సింగ్, మదన్ సహానీ,
జమా ఖాం, సునీల్
వీరందరి అనుభవం, రాజకీయంపై వున్న పట్లును పూర్తిగా పరిశీలించిన తర్వాతే వీరికి మంత్రి పదవులు కట్టబెట్టాలన్న కసరత్తు నడిచింది.
14 న రాజీనామా.. 15 న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం…
కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 14 న ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేయనున్నారు. అలాగే 15 న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం వుంటుంది. అయితే 14 న చివరి కేబినెట్ భేటీ నితీశ్ అధ్యక్షతన జరగనుంది. ఆ తర్వాత జేడీయూ శాసనసభా పక్షం సమావేశం జరగనుంది. ఇందులో రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం చర్చిస్తారు. మరీ ముఖ్యంగా నితీశ్ కుమార్ పాత్రపై కూడా చర్చ జరగనుంది.
ఇవి కూడా చదవండి







