జులై 11 నుండి TAMA ఉచిత ‘జెనరేటివ్ AI’ ఆన్లైన్ శిక్షణ
TAMA: అట్లాంటాలోని ప్రముఖ తెలుగు సంస్థ “తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా” (TAMA) కెరీర్ గైడెన్స్ టీమ్ ఆధ్వర్యంలో సరికొత్త సాంకేతికతపై ఆసక్తి ఉన్నవారికోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది. ‘KKR GENAI INNOVATIONS’ సౌజన్యంతో పూర్తిగా ఉచితంగా “Generative AI” ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
వివరాలు..
శిక్షణా కాలం: శనివారం, 11 జులై 2026 నుండి 2 ఆగస్టు 2026 వరకు.
సమయం: ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు (EST) / ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు (CST).
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జులై 10, 2026.
ఈ శిక్షణకు సంబంధించిన ఇతర వివరాలు లేదా ఏవైనా సందేహాల కోసం
POC: అపురూప్ (Apuroop) ను +1 781 308 9100 లేదా +1 470 861 6312 నంబర్లలో సంప్రదించవచ్చు. అలాగే సంస్థ మెంబర్షిప్ కోసం బ్రోషర్లోని క్యూఆర్ (QR) కోడ్ను స్కాన్ చేయవచ్చు.








