నైటా ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్) ప్రెసిడెంట్ రవీందర్ కోడెల ఆధ్వర్యంలో బేత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్ లో ఈ ఉత్సవాలు జరిగాయి.
ప్రవాస తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, మరియు వెంకట్ మారోజు, నారాయణస్వామి వక్తలుగా పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు, ప్రొఫెసర్ జయశంకర్ లకు నివాళులు అర్పించారు.
మిమిక్రీ కళాకారుడు రమేష్, సింగర్ అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అశోక్ చింతకుంట కొమరం భీమ్ ఏకపాత్రాభినయం అలరించింది. చిన్నారులు అదిరిపోయే ఫ్యాషన్ షో, నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా ఏర్పరిచిన అమరవీరుల స్థూపం డెకొరేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచినది.

ప్రజల ఆంకాక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ మరింత అభివృద్ది జరగాలని, అందుకోసం తమవంతు పాత్రపోషిస్తామని నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ హరిచరణ్ బొబ్బిలి, కార్యదర్శి మహేష్ దోమల, ట్రజరర్ Dr. సౌమ్య చిట్టారి, నైటా కార్యవర్గం, చైర్మన్ Dr. రాజేందర్ రెడ్డి జిన్నా, వైస్ చైర్మన్, Laxman ఏనుగు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సలహాసంఘం సభ్యులు, TTA, TLCA, TANA ప్రతిని్థులు, కామ్యూనిటీ ప్రముఖులు కుటంబాలతో సహా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.








