స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్ తో మంత్రి లోకేష్ భేటీ
స్బేర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో విస్తరించండి
యాంటీ-ఫ్రాడ్ నెట్వర్క్ కోసం సాంకేతిక సహకారం అందించండి
ఎపిలో ఫార్మా, అగ్రి ఎక్స్ పోర్టర్లకు వ్యవస్థీకృత రుణాలు అందించండి
మాస్కో: రష్యా ప్రభుత్వ నియంత్రిత ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్బ్యాంక్ (Sber bank) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్ (Mr Albert Yefimov)తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… “వెస్ట్రన్ ప్లాట్ ఫాంలకు సురక్షితమైన లోకలైజ్డ్ జనరేటివ్ ఎఐ ప్రత్యామ్నాయ వ్యవస్థను అందించిన తరహాలోనే భారతదేశంలో బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు స్బేర్ బ్యాంక్ గిగాచాట్ ఎల్ఎల్ఎం ను విస్తరించండి. జాతీయ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) నెట్వర్క్ భద్రతను పటిష్టం చేస్తూ, స్బేర్బ్యాంక్ యొక్క అడ్వాన్స్డ్ వాయిస్ రికగ్నిషన్ & బయోమెట్రిక్ యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్‌ను భారతదేశ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల్లో ఇంటిగ్రేట్ చేసేలా సాంకేతిక సహకారం అందించండి. భారత్ లో పెద్దఎత్తున మున్సిపల్ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి కొనసాగుతున్న స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా స్బేర్బ్యాంక్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్, స్మార్ట్ ట్రాన్సిట్ సర్వైలెన్స్, డిజిటల్ సేఫ్టీ సిస్టమ్‌లను విస్తరించండి. ప్రపంచస్థాయి సాఫ్ట్ వేర్, ఎఐ ఇంజనీర్లకు వేగంగా శిక్షణ ఇవ్వడానికి, స్బేర్ బ్యాంక్ యొక్క గేమిఫైడ్, పీర్-టు-పీర్ “స్కూల్ 21″ కోడింగ్ అకాడమీలను భారతదేశంలోని ప్రధాన విద్యా కేంద్రాలలో ఏర్పాటుచేయండి. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుల సౌలభ్యం కోసం దూరప్రాంతాలకు రూపాయి- రూబుల్ వాణిజ్య అనుమతులు, వ్యవస్థీకృత రుణాలు అందించాలి” అని లోకేష్ విజ్ఞప్తిచేశారు.
స్బేర్బ్యాంక్ (Sber bank) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్ స్పందిస్తూ… తమ బ్యాంక్ భారత్ లోని న్యూఢిల్లీ కార్యాలయం ద్వారా ద్వైపాక్షిక కమర్షియల్ ఫైనాన్స్, కార్పొరేట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు, భారత్-రష్యా క్లయింట్ డెలివరీ సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరు లోని తమ ఐటీ హబ్ సరిహద్దు వాణిజ్య పరిష్కారాలు, రూపాయి-రూబుల్ యంత్రాంగాలకు సమన్వయ కేంద్రంగా పనిచేస్తుంది. న్యూఢిల్లీ, ముంబైలోని శాఖలు వ్యూహాత్మక వాణిజ్య కారిడార్లలో మౌలిక సదుపాయాల పెట్టుబడికి గేట్ వేలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. కీలక వాణిజ్య డెస్క్‌ల ట్రెజరీ కార్యకలాపాలు, కార్పొరేట్ రుణాల మంజూరు, ఎంటర్ప్రైజ్ క్లయింట్ల కోసం ఏఐ-ఆధారిత డేటా విశ్లేషణలను నిర్వహిస్తున్నామని అన్నారు. స్బేర్ బ్యాంక్ గ్లోబల్ బ్యాంకింగ్ నెట్ వర్క్ ద్వారా మాసివ్ లిక్విడిటీ, అడ్వాన్స్డ్ డిజిటల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్నామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ చేసిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
Sber bank గురించి…
స్బేర్ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్, క్లౌడ్ సేవలు, ఏఐ (AI) రంగాలకు విస్తరించిన, ప్రభుత్వ నియంత్రణలోని ఒక ప్రధాన బ్యాంకు. మాస్కో కేంద్ర కార్యాలయంగా పనిచేస్తున్న ఈ బ్యాంకు 110 మిలియన్లకు పైగా రిటైల్, 3.5 మిలియన్ల కార్పొరేట్ ఖాతాదారులను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2.87లక్షలమంది ఉద్యోగులు కలిగిన ఈ బ్యాంకు 2025 ఆర్థిక సంవత్సరంలో 15.6 ట్రిలియన్ రూబుల్స్ (రూ.2.07లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. 12వేల శాఖలు కలిగిన స్బేర్ బ్యాంక్ ప్రతిరోజూ 8కోట్లకు పైగా డిజిటల్ వినియోగదారులకు సేవలు అందిస్తోంది.








