జుట్టు రాలడం తగ్గా లంటే ఇంట్లోనే ఇలా ఉల్లిపాయ నూనెను సులభంగా తయారు చేసుకోండి.
కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల జుట్టుకు తాత్కాలిక లాభమే ఉంటుంది. కానీ ఉల్లిపాయ నూనె శాశ్వత పరిష్కారం చూపిస్తుంది.
ఉల్లిపాయలోని సల్ఫర్ జుట్టు కుదుళ్లను బలంగా మార్చి, జుట్టు విరిగిపోవడాన్ని, రాలడాన్ని పూర్తిగా తగ్గిస్తుంది.
ఈ నూనె తయారీకి రెండు ఉల్లిపాయలు, ఒక కప్పు కొబ్బరి నూనె, కొద్దిగా మెంతులు మరియు కరివేపాకు అవసరం అవుతాయి.
ముందుగా ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కోసి లేదా మిక్సీ పట్టి మెత్తని పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి.
కొబ్బరి నూనెలో ఉల్లిపాయ పేస్ట్, మెంతులు వేసి, తక్కువ మంటపై నూనెను బాగా మరిగించి చల్లార్చాలి.
చల్లారిన నూనెను వడగట్టి గాజు సీసాలో పోయాలి. దీనిని చల్లని ప్రదేశంలో ఉంచితే కొన్ని వారాలు వాడుకోవచ్చు.
మీకు చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే, ఈ నూనెను మరిగించేటప్పుడు కొన్ని వేపాకులను కూడా జోడించండి.
వారానికి 2 లేదా 3 సార్లు ఈ నూనెతో మాడుపై మసాజ్ చేసి, గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.