3rd June 2026

___________

- Saidulu

షుగర్ ఉన్నవారు కూడా ఆస్వాదించే అరికల పాయసం!

సాయంత్రం 4 గంటలకి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తోందా? అయితే మైదా, వైట్ షుగర్ జోలికి వెళ్లకుండా.. ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ సిరిధాన్యాల పాయసం ట్రై చేయండి!

అరికలు (Kodo Millet): అర కప్పు ఆర్గానిక్ బెల్లం తరుగు: 1 కప్పు కాచి చల్లార్చిన పాలు: 3 కప్పులు నెయ్యి: 2-3 చెంచాలు యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్: తగినంత

కావలసిన పదార్థాలు

మిల్లెట్స్ పర్ఫెక్ట్‌గా ఉడకాలన్నా, ఈజీగా అరగాలన్నా వాటిని కనీసం 2-4 గంటలు నానబెట్టడం ముఖ్యం. ఆఫీస్ లేదా పనుల నుండి ఇంటికి వచ్చేసరికే ఇవి నానేలా ప్లాన్ చేసుకోండి.

షెఫ్ సీక్రెట్.. నానబెట్టడం!

నానబెట్టిన అరికలను నీళ్లు వంపేసి, ఒక చెంచా నెయ్యిలో రెండు నిమిషాలు లైట్‌గా వేయించండి. ఇలా చేయడం వల్ల పాయసానికి మంచి నట్టి (Nuty) ఫ్లేవర్ వస్తుంది.

 నెయ్యిలో దోరగా వేయించడం

వేయించిన అరికలను ప్రెజర్ కుక్కర్‌లో వేసి, 1 కప్పు పాలు, 1 కప్పు నీళ్లు పోసి 3 విజిల్స్ రానివ్వండి. మిల్లెట్స్ సాఫ్ట్‌గా ఉడికితేనే పాయసం టేస్టీగా ఉంటుంది.

క్విక్ కుకింగ్ ప్రాసెస్

అరికలు ఉడికేలోపు, మరో గిన్నెలో బెల్లం తరుగు, కొద్దిగా నీళ్లు పోసి కరిగించండి. పాకం అవసరం లేదు, బెల్లం కరిగాక నలకలు లేకుండా వడకట్టి పక్కన పెట్టుకోండి.

 బెల్లం సిరప్ సిద్ధం చేయడం

ఉడికిన అరికల మిశ్రమంలో మిగిలిన పాలు పోసి, మంటను సిమ్‌లో ఉంచి మరో 3-4 నిమిషాలు బాగా మరగనివ్వండి. పాలు, అరికలు చక్కగా కలిసిపోవాలి.

పాలు, మిల్లెట్స్ కలపడం

ముఖ్యమైన షెఫ్ టిప్: స్టవ్ ఆఫ్ చేసిన 2 నిమిషాల తర్వాతే వడకట్టిన బెల్లం నీళ్లను కలపాలి. మరుగుతున్న పాలలో బెల్లం వేస్తే పాయసం విరిగిపోయే ఛాన్స్ ఉంది.

పాలు విరగకుండా బెల్లం కలపడం

మిగిలిన నెయ్యిలో జీడిపప్పు, కిస్‌మిస్, బాదం పప్పులను దోరగా వేయించి పాయసంలో కలపండి. చివరగా తాజా యాలకుల పొడి చల్లితే సువాసన అదిరిపోతుంది.

క్రంచీ డ్రై ఫ్రూట్స్ తడకా

వేడి వేడిగా ఒక బౌల్‌లో సర్వ్ చేసుకోండి. ఇది కడుపుని నింపడమే కాదు, సాయంత్రం వేళ మనసుకు, ఆరోగ్యానికి ఎంతో హాయిని ఇస్తుంది!

పర్ఫెక్ట్ ఈవెనింగ్ స్నాక్ రెడీ!

సాయంత్రం పూట మరింత రిచ్‌గా కావాలనుకుంటే.. చివరగా కొద్దిగా పచ్చి కోవా లేదా గార్నిషింగ్ కోసం రోస్టెడ్ మఖానా (తామర గింజలు) కూడా వాడుకోవచ్చు!