జూన్ 12న TASC ‘మీట్ & గ్రీట్’ కార్యక్రమం
TASC: దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం (TASC) ఆధ్వర్యంలో ఒక వినూత్న , ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమానికి తెరలేచింది. ప్రముఖ వైద్యులు, చలనచిత్ర నిర్మాత , తెలుగు సమాజానికి అంకితభావంతో సేవలందిస్తున్న డా. సత్యమూర్తి కోటమరాజు (MD)తో ఒక ప్రత్యేక ‘మీట్ & గ్రీట్’ (Meet & Greet) కార్యక్రమాన్ని TASC ప్రతినిధులు ఏర్పాటు చేశారు.
వివరాలు..
ఈ కార్యక్రమం జూన్ 12, 2026 (శుక్రవారం) సాయంత్రం 7:00 గంటలకు యోర్బా లిండా (Yorba Linda, CA) నగరంలో జరగనుంది. సినిమా రంగంతో ఉన్న అనుబంధాన్ని, మధురమైన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ… స్నేహపూర్వక వాతావరణంలో సాగే ఈ సాయంత్రం వేడుకలో రుచికరమైన విందు, పానీయాల (Dinner & Drinks) సదుపాయం కూడా కలదు.
నిర్వాహక బృందం..
ఈ కార్యక్రమాన్ని TASC ప్రెసిడెంట్ కొండలరావు వాయినేని, సెక్రటరీ శంకర్ సింగంశెట్టి, ట్రెజరర్ మహేష్ నూకల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ వేణురెడ్డి కట్కూరి, పాస్ట్ ప్రెసిడెంట్ సీతారాం పామిరెడ్డి, ఈసీ సభ్యులు ప్రసూన బసాని, మహేష్ కపాదం, సైదులు కొలాసని తదితరులు పర్యవేక్షిస్తున్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమపై, కళలపై ఆసక్తి ఉన్నవారందరూ ఈ ప్రేరణాత్మకమైన సంభాషణలు, నెట్వర్కింగ్ , సామూహిక కలయిక కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా TASC కార్యవర్గ బృందం (Executive Team) కోరుతోంది.మరిన్ని వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్సైట్ www.mana-tasc.org ను సందర్శించవచ్చు.








