‘ఆల్ఫా’ సెట్స్‌లో ఆలియా భట్‌తో విభేదాల రూమర్లపై బాబీ డియోల్ స్పందన
యష్ రాజ్ ఫిల్మ్స్(Yash raj films) ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఆల్ఫా(Alpha) సినిమా షూటింగ్ నేపథ్యంలో ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర ప్రచారం జరిగింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బాబీ డియోల్(Bobby deol), హీరోయిన్ ఆలియా భట్ మధ్య సెట్స్‌లో విభేదాలు తలెత్తాయని పలు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించిన బాబీ డియోల్, ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తనకు కూడా ఈ రూమర్ గురించి ఒక స్నేహితుడు పంపిన సందేశం ద్వారానే తెలిసిందని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బాబీ డియోల్, ప్రతి ఒక్కరికీ నేను వెళ్లి నిజం నిరూపించాల్సిన అవసరం లేదు. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని స్పష్టంగా చెప్పారు. సోషల్ మీడియాలో ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారం అయ్యే కథనాలు ఎంత వేగంగా వైరల్ అవుతాయో ఈ ఉదంతం మరోసారి చూపించిందన్నారు. తన దృష్టి మొత్తం సినిమా పనిపైనే ఉంటుందని, ఇలాంటి గాసిప్‌లకు ప్రాధాన్యం ఇవ్వనని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా ఆలియా భట్‌పై బాబీ ప్రశంసలు కురిపించారు. ఆమె అత్యంత కష్టపడే నటి అని, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల కోసం ఎంతో ముందస్తు ప్రిపరేషన్‌తో సెట్స్‌కు వచ్చేదని తెలిపారు. షూటింగ్ మొత్తం సమయంలో ఆమె పూర్తి ప్రొఫెషనలిజం ప్రదర్శించిందని చెప్పారు. దీంతో ఆల్ఫా సెట్స్‌లో విభేదాలపై జరుగుతున్న ప్రచారానికి బాబీ డియోల్ వ్యాఖ్యలతో తెరపడినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.








