డ్రాగన్ డైరెక్టర్ చేతికి తలైవర్173
తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటైన తలైవర్173(thalaivar173) మరో కీలక అప్డేట్తో వార్తల్లో నిలిచింది. దక్షిణ భారత సినీ దిగ్గజాలు రజనీకాంత్(Rajinikanth), కమల్ హాసన్(Kamalhassan) పేర్లు ఒకే ప్రాజెక్ట్‌తో అనుసంధానమవడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్(Rajkamal films international) బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదట డైరెక్టర్ సుందర్ సి(Sundar C) చేతుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్, తరువాత డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి(Cibi Chakravarthy)కి వెళ్లినప్పటికీ, టెక్నికల్ ఛేంజెస్ కారణంగా మరోసారి డైరెక్టర్ మారిన విషయం తెలిసిందే.
ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ద్వారా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్(Return Of the Dragon), ఓ మై కడవులే(Oh my kadavule) సినిమాలతో గుర్తింపు పొందిన యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు(Aswath Marimuthu) ఈ ప్రతిష్టాత్మక సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ అనౌన్స్మెంట్ తో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ కథనాలను సమర్థంగా తెరకెక్కించే అశ్వత్‌కు, ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బాధ్యత దక్కినట్టయింది.
ఇక సంగీత బాధ్యతలను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(anirudh Ravichander) నిర్వహించనుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. అఫీషియల్ రిలీజ్ డేట్‌ను ఇంకా అనౌన్స్ చేయకపోయినా, తలైవర్173ను 2027 పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. రజనీకాంత్ స్టార్డమ్, కమల్ హాసన్ నిర్మాణ విలువలు, అనిరుధ్ సంగీతం, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం కలిసి ఈ సినిమాను కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో మైలురాయిగా నిలబెడతాయా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.








