భారీ తారాగణంతో మాటా రెండో మహాసభలు
మన అమెరికా తెలుగు సంఘం అమెరికాలోనే అతి పెద్ద సంఘాల్లో ఒకటిగా గుర్తింపును పొందింది. అమెరికాలో కమÖ్యనిటీకోసం నెలకు 15 నుంచి 20 వరకు కార్యక్రమాలను చేస్తూ, మరోవైపు ఇండియాలో కూడా సంవత్సరానికి 200 కార్యక్రమాలకు పైగా చేస్తున్న మన అమెరికా తెలుగు సంఘం వివిధ రంగాల కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో మహాసభలను నిర్వహిస్తోంది. ఈసారి నిర్వహించే మహాసభలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అమెరికాలోని తెలుగు సంస్కృతి, ఐక్యతను చాటిచెప్పేలా అత్యంత భారీ స్థాయిలో ఈ మెగా కన్వెన్షన్‌ను ఏర్పాటు చేశారు. జూన్ 19, జూన్ 20, 2026న రెండు రోజుల పాటు పెన్సిల్వేనియాలోని ప్రసిద్ధ ‘ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర’ వేదికగా ఈ సంబరాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో వినోదం, సంస్కృతి, వ్యాపాs, సామాజిక అంశాలకు సంబంధించిన పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సినీ రంగ ప్రముఖురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు జయప్రద మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
కన్వెన్షన్ కమిటీ
కన్వెన్షన్ నిర్వహణకోసం ఏర్పాటు చేసిన అడ్వయిజరీ కమిటీలో శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, జితేందర్ రెడ్డి ఉన్నారు. కోర్ కమిటీలో రమణ కిరణ్ దుద్దగి (ప్రెసిడెంట్), శ్రీధర్ గూడల కన్వీనర్, కో-కన్వీనర్లు టోనీ జన్ను, దాము గేదెల, ప్రవీణ్ గూడూరు వైస్ ప్రెసిడెంట్, విజయ్ భాస్కర్ కలాల్ సెక్రటరీ, గంగాధర్ ఉప్పల కో ఆర్డినేటర్, కళ్యాణి బెల్లంకొండ కో ఆర్డినేటర్, నాగేష్ చిలకపాటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శిరీష గూడపునేని స్రిట్చువల్, మెంబర్ షిప్ డైరెక్టర్, మహేందర్ నరాల ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, స్వాతి అట్లూరి ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్ డైరెక్టర్, శ్రీధర్ పెంట్యాల అడిషనల్ సెక్రటరీ, ప్రశాంత్ శ్రీపెరంబుదూరు, పబ్లిసిటీ, మీడియా డైరెక్టర్, డా. విజయ్ భాస్కర్ బొల్గామ్ ఇండియా కో ఆర్డినేటర్, సురేష్ ఖజానా స్పోర్ట్స్ డైరెక్టర్ ఉన్నారు.
ఈ మహాసభల ప్రధాన ఆకర్షణలు:
* ఆధ్యాత్మికత: అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే శ్రీ భద్రాచల సీతారాముల కళ్యాణ మహోత్సవం.
* సంగీత విభావరి: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మరియు పాపులర్ సింగర్ రామ్ మిరియాల లైవ్ కాన్సర్ట్స్.
* యువత, ప్రతిభ: ‘మాటా సింగింగ్ స్టార’ పోటీలు, యూత్ ప్రోగ్రామ్స్ మరియు వైవిధ్యభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు.
* ప్రత్యేక ఫోరమ్స్: ఆధునిక సాంకేతికతపె ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫోరమ’, వైద్యుల కోసం సిఎంఇ సెషన్స’, మహిళల ఫోరమ్, ఫ్యాషన్ షో, అలాగే బిజినెస్, పొలిటికల్ మరియు లీగల్ ఫోరమ్స్ తరపున వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
* పెళ్ళి సంబంధాల వేదిక (మ్యాట్రిమొనీ మీట్), ప్రతిభావంతులకు ‘ఎక్సలెన్స్ అవార్డ్స’ ప్రదానం.
* టాలీవుడ్ ప్రముఖ సినీ నటీనటులతో కార్యక్రమాలు
* వైవిధ్యమైన స్టాళ్లు, బిజినెస్ వెండర్స్ మరియు ఎగ్జిబిట్స్ వంటివి ఈ మహాసభల్లో ఏర్పాటు చేశారు.
తెలుగు సంస్కృతీ వైభవాన్ని, ప్రవాస తెలుగువారి ప్రతిభను ఒకే వేదికపై చూసేందుకు వీలుగా ఈ ఏర్పాట్లను మహాసభల కమిటీ చేస్తోంది. తెలుగువారంతా కలిసికట్టుగా ఈ మహాసభలను జయప్రదం చేÖలని ‘మాటా’ కమిటీ కోరుతోంది.
సెలబ్రిటీల సందడి..
ఈ మహాసభల్లో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు, గాయకులు, యాంకర్లు , హాస్యనటులు సందడి చేయనున్నారు. ఈ మహాసభల్లో సీనియర్ నటి జయప్రద, యాంకర్ సుమ కనకాల, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్, హీరో నిఖిల్ సిద్ధార్థ, నటుడు సుమన్, నటి ఐశ్వర్య రాజేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరితో పాటు ప్రముఖ గాయకులు రామ్ మిరియాల, సమీరా భరద్వాజ్, రీటా, సాగర్, కార్తీక్ మాల్యాల బృందాలతో లైవ్ మ్యూజికల్ పెర్ఫార్మెన్స్, అలాగే రామచారి సంగీత కార్యక్రమం ప్రేక్షకులను అలరించనున్నాయి.
వినోదాల హంగామా..
హాస్యనటులు అలీ, శివారెడ్డి, మిమిక్రీ రమేష్, అధిరే అభి, సుధాకర్, మఖ్దూమ్ సయ్యద్ , ఆర్జే భార్గవి, నిఖిల్ల యాంకరింగ్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. లైవ్ కాన్సర్ట్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలు, కమ్యూనిటీ నెట్వర్కింగ్, రుచికరమైన విందు వినోదాలతో కూడిన ఈ మహా ఈవెంట్లో అందరూ కుటుంబ సమేతంగా పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.
ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు మాటా అడ్వైజరీ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, జితేందర్ రెడ్డి; ప్రెసిడెంట్ రమణ కిరణ్ దుడ్డగి, కన్వీనర్ శ్రీధర్ గూడల మరియు ఆర్గనైజింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ‘ఎక్స్‌పాట్ మనీ’, ‘ఎమ్ ఎస్ ఎన్ ఓ రియల్టీ’ సంస్థలు ఈ ఈవెంట్‌కు మెగా స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి.
మాటా సింగింగ్ స్టార్ పోటీలు
మహాసభల సందర్భంగా సంగీత ప్రియుల కోసం ‘మాటా సింగింగ్ స్టార్’ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ , ఎలఎమఏ బాలగంధర్వం వ్యవస్థాపకులు డాక్టర్ రామాచారి కొమండూరి అడ్వైజర్, మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.
విభాగాలు..
క్లాసికల్, నాన్-క్లాసికల్ విభాగాలలో జరుగుతున్న ఈ పోటీలకు రిజిస్ట్రేషన్ ఫీజుగా 20 డాలర్లుగా నిర్ణయించారు. ఈ పోటీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ముగిశాయి
పోటీల వివరాలు..
* ఆడిషన్స్ / ప్రిలిమ్స్: ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు.
* సెమీస్ అండ్ గ్రాండ్ ఫినాలే: కన్వెన్షన్ వేదికపై నేరుగా నిర్వహిస్తారు. ఫైనలిస్టులు అందరూ కన్వెన్షన్‌లో ప్రదర్శన ఇస్తారు.
* వయస్సు వర్గీకరణ: సబ్-జూనియర్స్ (6-11 సంవత్సరాలు), జూనియర్స్ (12-18 సంవత్సరాలు), అడల్ట్స్ (19 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ).
ఈ పోటీల నిర్వహణ కోసం హరి కృష్ణ మహర్షి చైర్మన్‌గా, చైతు మద్దురి, రంగ మడిశెట్టి, శ్రీలక్ష్మి లక్కిశెట్టి, ఉష రామక కో-చైర్మన్లుగా ‘మటా సింగింగ్ స్టార్ కమిటీ’ పర్యవేక్షిస్తోంది.
భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవం
‘మన అమెరికా తెలుగు సంఘం’ తన 2వ మహాసభల సందర్భంగా వివిధ నగరాల్లో భద్రాచల సీతారాముల కళ్యాణ మీVAత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను మాటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. భారత్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానం నుండి స్వయంగా విచ్చేస్తున్న అర్చకులు, ఉత్సవ మూర్తులతో శాస్త్రోక్తంగా ఈ కల్యాణాన్ని జరిపించనున్నారు. భద్రాచలం క్షేత్ర సంప్రదాయం ప్రకారం, చేతితో దంచిన వరి బియ్యాన్నే కల్యాణ తలంబ్రాలుగా ఉపయోగిస్తారు. ఈ సంప్రదాయాన్ని ఇక్కడ కూడా కొనసాగించేందుకు నిర్వాహకులు ప్రత్యేకంగా వడ్లను సేకరించారు. భక్తులు చిన్న సంచులలో ఈ వడ్లను తీసుకువెళ్లి, రామనామ స్మరణ చేస్తూ చేతితో వలిచిన బియ్యాన్ని కల్యాణ తలంబ్రాల కోసం తీసుకురావాలని కోరారు. మే 30న టంపా, ఫ్లోరిడా, జూన్ 6, 2026 (శనివారం) శాన్ ఆంటోనియో, టెక్సాస్, వేదిక: హిందూ టెంపుల్ ఆఫ్ శాన్ ఆంటోనియో, జూన్ 7, 2026 (ఆదివారం) – డల్లాస్, టెక్సాస్, వేదిక: ఫ్రిస్కో ఫ్లయర్స్, జూన్ 13, 2026 (శనివారం) — అట్లాంటా, జార్జియాలో ఏర్పాటు చేశారు.
ఈ ఆధ్యాత్మిక యాత్ర ముగింపు వేడుకగా, జూన్ 20, 2026 (శనివారం) న ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో జరిగే ‘మాటా’ 2వ కన్వెన్షన్ వేదికపై భద్రాచల శ్రీ సీతారామ కల్యాణం మరియు పట్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.








