ఇరాన్ లో ఆధిపత్య పోరాటం తీవ్రస్థాయికి చేరిందా..?
అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీంలీడర్ అయాతుల్లా ఖమైనీ చనిపోవడంతో.. ఆదేశ పగ్గాలను ముజ్తబాకు అప్పగించారు. అయితే ముజ్తబా కూాడా బాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డారని.. అందుకే బయటకు రావడం లేదంటున్నారు. అంతేకాదు.. ఆయన కేవలం మెసేజెస్ ద్వారా మాత్రమే ..ఆదేశాలు జారీ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే .. ఈక్రమంలో అధినేత మసౌద్ పెజెష్కియాన్ .. కొన్నిరోజులు దేశాన్ని నడిపించినట్లు కనిపించారు. క్రమంగా యుద్ధం తీవ్రరూపు దాల్చడంతో .. పగ్గాలు ఆయన చేతి నుంచి ఐఆర్‌జీసీకి వెళ్లినట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలో తమకు తెలియకుండా ఐఆర్జీసీ సొంత నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తూ..
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ రాజీనామా చేసినట్లు తెలిసింది. ఆయన తన రాజీనామా లేఖను సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి పంపినట్లు సమాచారం. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) తీరుతో కలత చెంది ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. . ప్రస్తుత పరిస్థితుల్లో తాను చట్టబద్ధ బాధ్యతలను నిర్వహించలేకపోతున్నట్లు తన రాజీనామా లేఖలో పెజెష్కియాన్ పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ వార్తలను అధ్యక్షుడి కార్యాలయం ఖండించింది. ఇది ఆధారం లేని వార్తని, ప్రచారం కోసం పాకులాడే ఓ యువకుడు లేవనెత్తిన ప్రచారంగా దీనిని అధ్యక్షుడి కార్యాలయ సమాచార ప్రతినిధి సయ్యద్ మెహదీ స్పష్టం చేశారు. ఇది విశ్వసనీయత లేని విదేశీ శక్తుల కుట్రని, మీడియా గేమ్‌లో భాగమని వ్యాఖ్యానించారు. తమ ఆశలకు అనుగుణంగా ఇటువంటి వార్తలను అవి ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.








