పని చేసే పార్టీలకు ప్రచారం అవసరం లేదు : భట్టి విక్రమార్క
ఓటర్ల జాతితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్) పై మీడియా (Media) దృష్టి పెట్టాలని ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ప్రతి ఒక్కరూ సర్ మ్యాపింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ అవతవరణ వేడుకల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి ప్రత్యర్థులే లేరని వ్యాఖ్యానించారు. రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ (BJP)నే. పని చేసే పార్టీలకు ప్రచారం అవసరం లేదు. అసెంబ్లీ (Assembly), ఎంపీ (MP), మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా చూపించాం. జిల్లా పరిషత్ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని తెలిపారు.








