సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలి : సీఎస్ రామకృష్ణారావు
ఓటరు జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Ramakrishna Rao) కలెక్టర్ల (Collectors)ను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ (Village), వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వివరించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్లలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) నిర్వహించారు. రాష్ట్రంలో పంటల వైవిధ్యతపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణంపైనా అవగాహన కల్పించాలని సూచించారు.








