రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూల విక్రయం : టీటీడీ
ఈ ఏడాది మే నెలలో శ్రీవారి లడ్డూ (Srivari Laddu) ప్రసాదం విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మొత్తం 1.21 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ (TTD ) వెల్లడించింది. 2024 మే (May) నెలలో 1.01 కోట్లు, 2025 మే నెలలో 10.10 కోట్ల లడ్డూలను విక్రయించగా, ఈసారి సంఖ్య మరింత పెరిగింది. రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేసింది. లడ్డూల తయారీకి టీటీడీ రోజువారీగా 68 టన్నుల ముడి పదార్థాలను వినియోగిస్తోంది. ఇటీవలి కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచి మరింత మెరుగుపడటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత, సంప్రదాయం, భక్తి భావనల సమ్మేళనంగా నిలిచే శ్రీవారి లడ్డూ ప్రసాదం తిరుమల (Tirumala) మహత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతోంది.







